Supreme Court: న్యూస్‌క్లిక్ వ్యవస్థాపక ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ అరెస్టు చెల్లుబాటు కాదని.. తక్షణమే విడుదల చేయాలని బుధవారం నాడు సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం జడ్జిలు బీఆర్ గవాయి, సందీప్ మెహతాలతో కూడిన న్యూస్ క్లిక్ ఎడిటర్ అరెస్టుకు సంబంధించి రిమాండ్ కాపీ తమకు అందజేయలేదని, కాబట్టి ప్రబీర్ పురకాయస్థ అరెస్టు చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది. కాగా న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఢిల్లీ పోలీసులు తనను అన్‌లాఫుల్ యాక్డివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఈపీఏ) కేసు కింద అరెస్టు సవాలు చేయడాన్ని ఆయన కోర్టులో సవాలు చేశారు.
అరెస్టు చట్టవిరుద్దం..(Supreme Court)
జస్టిస్ బీఆర్ గబాయి, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ప్రబీర్ పిటిషన్‌ను స్వీకరించి విచారణ జరిపింది. కాగా ట్రయల్ కోర్టు విచారణ జరిపి బెయిల్ ఇవ్వడాన్ని సమర్థించింది. ట్రయల్ కోర్టు విచారణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. కాగా ఢిల్లీ పోలీసులు పురకాయస్థను యూఈపీఏ కింద అరెస్టు చేయడం చట్టవిరుద్దమని ప్రకటించింది. అదే విధంగా ఆయనను తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు చార్జీషీటు ఫైల్ చేయలేదని పేర్కొంది. కాగా ట్రయల్ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడానికి అంగీకరించింది తాము కూడా ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని తెలిపింది.
లాయర్లకు సమాచారం ఇవ్వలేదు..
ఇదిలా ఉండగా రెండు వారాల క్రితం కోర్టు ఢిల్లీ పోలీసులను పురకాయస్థ అరెస్టుకు సంబంధించి ఆయన లాయర్లకు వాస్తవాలు ఎందుకు చెప్పలేదని నిలదీసింది. న్యూస్‌క్లిక్ ఎడిటర్‌ను మేజిస్ర్టేట్ ముందు హాజరు పరుస్తున్నామని పోలీసులు గోప్యంగా ఉంచడాన్ని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతకు ముందు రోజు ఆయను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఆయన లాయర్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదు. ఆగమేఘాల మీద ఉదయాన్నే ఆరు గంటలకు మేజిస్ర్టేట్ ముందు న్యూస్ క్లిక్ ఎడిటర్‌ను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నిలదీసింది. కాగా ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చార్జిషీట్‌లో ప్రబీర్ టెర్రర్ కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాలు ఉన్నాయని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, టెర్రర్ కార్కకలపాలకు నిధులు సేకరిస్తున్నారని.. కుట్రలు పన్నుతున్నారని చార్జిషీటులో పేర్కొంది. దీంతో పాటు న్యూస్‌క్లిక్ ఎడిటర్ నెవెల్లీ రాయ్ సింగమ్, ఇతరులతో కలిసి భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కేంద్రప్రభుత్వం కోవిడ్-19ని అడ్డుకట్టవేయడంలో విఫలం అయ్యిందని.. ఇండియన్ ఫార్మాకంపెనీలు వ్యాక్సిన్ తయారీకి సంబంధించి వ్యతిరేక వార్తలు ప్రచురించిందని పోలీసులు న్యూస్‌క్లిక్ ఎడిటర్‌పై ఆరోపణలు గుప్పించాయి.
ఇదిలా ఉండగా న్యూస్‌క్లిక్ ఎడిటర్‌ను గత ఏడాది అక్టోబర్ 3న యాంటీ టెర్రర్ లా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కేసులో అరెస్టు చేశారు. అంతకు ముందు న్యూయార్క్ టైమ్స్ న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించింది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. 2019 లోకసభ ఎన్నికలకు ఆటంకం కలిగించడానికి కుట్రపన్నారన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు.