Arvind Kejriwal Case: ఆమ్ ఆద్మీపార్టీ చీఫ్ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అచ్చే దిన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకసభ ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకు ముందు సుప్రీంకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను 2024 లోకసభ ఎన్నికలకు ముందు అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. ఇదిలా ఉండగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం … ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ అరెస్టును కేజ్రీవాల్ సవాలు చేశారు. కేసు పరిష్కారానికి దీర్ఘ కాలం పట్టే అవకాశం ఉందని.. అందుకే ఆయనకు మధ్యంతర బెయిల్ గురించి ఆలోచించండని ధర్మాసంన ఈడీని కోరింది. దీనికి ప్రధాన కారణం లోకసభ ఎన్నికలని కోర్టు పేర్కొంది. కాబట్టి ఈడీ, సీబీఐ దీని గురించి ఒకసారి ఆలోచించాలని శుక్రవారం నాడు సుప్రీం ధర్మాసనం కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరింది.
మే 7న విచారిస్తాం..(Arvind Kejriwal Case)
అరవింద్ కేజ్రీవాల్ తరపున అభిషేక్ మనుసింఘ్వీ హాజరయ్యారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా సింఘ్వీని ఉద్దేశించి మాట్లాడుతూ.. కోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయవచ్చు… లేదా చేయకపోవచ్చు అని అన్నారు. అదే సమయంలో లాయర్లను హెచ్చరించారు. దీని గురించి పెద్దగా ఊహించుకోరాదన్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్ రావచ్చు.. రాకపోవచ్చు అన్న సుప్రీం ధర్మాసనం .. మధ్యంతర బెయిల్ గురించి మే 7న విచారిస్తామని పేర్కొంది. అయితే ఇదే కేసును చివరిసారి విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర దర్యాప్తు సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోకసభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను ఎలా అరెస్టు చేస్తారని నిలదీసింది. వ్యక్తిగత స్వేచ్చ ముఖ్యమని.. దాన్ని మీరు తోసిపుచ్చలేరు. అరెస్టు చేయడానికి మీరు ఎంచుకున్న సమయంపైనే తమకు అభ్యంతరం అని జస్టిస్ సంజీవ్ ఖన్నా అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజును నిలదీశారు. ఈడీ తరపున ఎస్‌వీ రాజు కోర్టులో వాదించారు.
ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదన ఏమిటంటే కేజ్రీవాల్ తన మంత్రులు ఆప్ నాయకులతో కలిసి లిక్కర్ వ్యాపారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున లంచాలు మింగారని.. బదులుగా లిక్కర్ పాలసీ వారికి అనుకూలంగా మార్చారని కేజ్రీవాల్‌పై ఆరోపణలు గుప్పించారు. దిల్లీ లిక్కర్‌పాలసీకి సంబంధించి కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్టు చేసి తిహార్ జైలుకు తరలించారు.