Site icon Prime9

Supreme Court Judges: సుప్రీం ధర్మాసనంపై మరో తెలుగు వ్యక్తి.. ప్రమాణం చేసిన కొత్త న్యాయమూర్తులు

Supreme Court 1

Supreme Court 1

Supreme Court Judges: సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు..రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, పట్నా హైకోర్టు సీజే జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, మణిపుర్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌,

పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎహసానుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు.

దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32 కు చేరింది. సుప్రీంకోర్టులో మొత్తం ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 34 కాగా.. ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి.

 

కేంద్రం సుప్రీం మధ్య భేదాభిప్రాయాలు

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కోలీజియం డిసెంబర్ 13న కొత్త న్యాయమూర్తుల నియామకాల కోసం సిఫారసు చేసింది.

ఐదుగురు పేర్లను సూచిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఈ ప్రతిపాదనల విషయంలో కేంద్రానికి, సుప్రీం కోర్టు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి.

కాగా కేంద్రం కావాలనే న్యాయమూర్తుల నియామక ప్రక్రియను ఆలస్యం చేస్తోందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో త్వరలోనే ప్రక్రియ పూర్తి చేస్తామని గత శుక్రవారం కేంద్రం తెలిపింది.

కాగా, సుప్రీం లో విచారణ జరిగిన మరునాడే(శనివారం) నియాయక ప్రక్రియ పూర్తి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

మరో ఇద్దరు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించడానికి కొలీజియం చేసిన సిఫారసులపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

 

సుప్రీంలో ఇద్దరు తెలుగు జడ్జీలు (Supreme Court Judges)

దేశ అత్యున్నత న్యాయస్థానంలో మరో తెలుగు వ్యక్తి జడ్డిగా నియమితులయ్యారు. హైదరాబాద్ కు చెందిన జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్(PV Sanjay Kumar) తో పాటు మరో నలుగురు

సుప్రీంకోర్టు జడ్జీలు గా ప్రమాణం చేశారు.

ప్రస్తుతం మణిపూర్ హైకోర్టు సీజే గా పనిచేస్తున్న పీవీ సంజయ్ కుమార్ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. 1964, ఆగష్టు 14 న ఆయన జన్మించారు.

ఆయన తల్లిదండ్రులు కడప జిల్లాకు చెందిన వారు. ఆయన తండ్రి పి. రామచంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు.

నిజాం కాలేజ్ లో కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిన సంజయ్ కుమార్.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచ 1988 లో లా పట్టా పొందారు.

అదే ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. తన తండ్రి కార్యాలయంలోనే న్యాయవాదిగా చేరారు.

2000-03 మధ్య ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసిన సంజయ్ కుమార్.. 2008 లో ఆగష్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు జడ్జిగా పదోన్నతి పొందారు.

2010 జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 లో పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలి అయ్యారు.

2021లో మణిపూర్ హైకోర్టు సీజే అయ్యారు సంజయ్ కమార్. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు జడ్డిగా జస్టిస్ పీఎస్ నరసింహ ఉన్నారు.

ఇప్పుడు మరో న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ నియమితులయ్యారు.

(జస్టిస్ వీపీ సంజయ్ కుమార్)

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version