Supreme Court judges: సర్వోన్నత న్యాయస్థానంలో ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.
త్వరలోనే వారి నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కేంద్రం స్పష్టం చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కోలీజియం డిసెంబర్ 13న నియామకాల కోసం సిఫారసు చేసింది.
ఈ సిఫారసులకు ప్రధాన మంత్రి కార్యాలయం ఫిబ్రవరి 2 న ఆమోదం తెలిపింది. అనంతరం నియామకాల ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్ కు పంపారు.
రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో ఐదుగురు న్యాయమూర్తులు వచ్చే వారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు(Supreme Court judges)
రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ పంకజ్ మిత్తల్, పట్నా హైకోర్టు సీజే జస్టిస్ సంజయ్ కరోల్, మణిపుర్ హైకోర్టు సీజే జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ ఎహసానుద్దీన్
అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ మిశ్రల పేర్లు తాజాగా ఆమోదించిన జాబితాలో ఉన్నాయి.
కేంద్రం తీరుపై సుప్రీం అసంతృప్తి (Supreme Court judges)
కేంద్రం కావాలనే న్యాయమూర్తుల నియామక ప్రక్రియను ఆలస్యం చేస్తోందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో త్వరలోనే ప్రక్రియ పూర్తి చేస్తామని శుక్రవారం కేంద్రం తెలిపింది.
కాగా, సుప్రీం లో విచారణ జరిగిన మరునాడే నియాయక ప్రక్రియ పూర్తి చేసింది కేంద్రం.
సుప్రీంకోర్టులో మొత్తం ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 34 . కొత్తగా నియమతులయ్య ఐదుగురు జడ్జీలతో కలుపుకుని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32 కి చేరుతుంది.
ఈ ఐదుగురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసు కేంద్ర ప్రభుత్వం వద్ద డిసెంబర్ 13 నుంచి పెండింగ్ లో ఉంది.
మరో ఇద్దరు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించడానికి కొలీజియం చేసిన సిఫారసులపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/