Udhayanidhi Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ ఈ నెలలోనే పలు బహిరంగ సభల్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు.. దేశం నుంచి నిర్మూలించాల్సిందేనని వ్యాఖ్యానించారు.
14 మందికి నోటీసు..(Udhayanidhi Stalin)
ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి డీఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఏ రాజా, మరో 14 మందికి నోటీసు జారీ చేసింది. ఈ 14 మందిలో సీబీఐతో పాటు తమిళనాడు పోలీసులకు కూడా నోటీసులు పంపింది. కాగా సనాతన ధర్మం నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలకు గాను ఉదయనిధిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కావడంతో ఉన్నత న్యాయస్థానం ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నెల ప్రారంభంలో సనాతనధర్మంపై ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డేంగ్యులతో పోల్చారు.
తమిళనాడులోని పలు బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా దేశం నుంచి తరిమికొట్టాల్సిందేనని అన్నారు. డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనాలను వ్యతిరేకించలేం, దాన్ని పూర్తిగా నిర్మాలించాల్సిందేనని వ్యాఖ్యానించారు. అలాగే సనాతన ధర్మాన్ని కూడా దేశం నుంచి పారద్రోలాల్సిందేనని ఘుటు వ్యాఖ్యలు చేశారు. కాగా స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగాయి. స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇంత జరిగినా.. స్టాలిన్ మాత్రం తన వ్యాఖ్యలను నుంచి వెనక్కి తగ్గేదీ లేదని స్పష్టం చేశారు.