Site icon Prime9

AAP Party Office: ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం ఖాళీ చేయడానికి గడువు పొడిగించిన సుప్రీంకోర్టు..

AAP Party Office

AAP Party Office

AAP Party Office: ఢిల్లీలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం ఖాళీ చేయడానికి సుప్రీంకోర్టు ఆగస్టు 10వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ ఏరియాలో ఆప్‌ పార్టీ ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది. కాగా ఢిల్లీ హైకోర్టు విస్తరణలో భాగంగా ఆప్‌ పార్టీ తమ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సోమవారం నాడు వెకేషన్‌ బెంచ్‌ జస్టిస్‌విక్రమ్‌నాథ్‌, సందీప్‌ మెహతా చివరి అవకాశంగా ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించింది. కాగా సుప్రీంకోర్టు బెంచ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్ట రిజిస్ర్టీ ముందు శాంతియుతంగా ఆస్తిని ఆగస్టు 10, 2024న అప్పగిస్తామని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని ఆదేశించింది.

ఢిల్లీ హైకోర్టుకు కేటాయింపు..(AAP Party Office)

ఇదిలా ఉండగా ఈ స్థలాన్ని ఢిల్లీ హైకోర్టుకు 2020లో కేటాయించడం జరిగింది. అటు నుంచి కోర్టును విస్తరించాలనుకుంటే రోజు రోజుకు నిర్మాణం వ్యయం పెరిగిపోతోంది. ఎట్టకేలకు తుద నిర్ణయం తీసుకొని ఆమ్‌ ఆద్మీపార్టికి చివరి అవకాశం ఇచ్చి ఆగస్టు 10, 2024లోగా ఖాళీ చేయాలని ఇదే చివరి అవకాశం అని కూడా ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఒక వారంలోగా ఆప్‌ పార్టీకి స్థలాన్ని అప్పగిస్తామని సుప్రీంకోర్టు రిజిస్ర్టీకి లిఖితపూర్వకంగా లేఖ రాసిఇవ్వాల్సి ఉంటుందని తాజా ఆర్డర్‌లో పేర్కొంది. కాగా ఆమ్‌ ఆద్మీపార్టీ కూడా తమకు ఆగస్టు 10 వరకు గడవు ఇవ్వాలని కోరింది.

ఇదిలా ఉండగా ఆమ్‌ ఆద్మీపార్టీ మాత్రం ఉన్నత న్యాయస్థానాన్ని తమకు ఈ ప్లాట్‌ను 2015లో కేటాయించారు. అయితే 2020లో ఈ స్థలాన్ని జ్యుడిషియరీకి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఆప్‌ పార్టీ వాదన ఏమిటంటే… తమ పార్టీ కూడా జాతీయ పార్టీ హోదా కలిగి ఉంది కాబట్టి మిగిలిన జాతీయ పార్టీల మాదిరిగానే తమకు ప్లాట్‌ కేటాయించాల్సిందిగా కోరింది. మిగిలిన జాతీయ పార్టీలకు సెంట్రల్‌ ఢిల్లీలో ప్లాట్‌ కేటాయించింది. తమకు కూడా కేటాయించాలనిఆప్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. దీనికి కోర్టు ఆప్‌పార్టీ కేంద్రప్రభుత్వానికి చెందిన ల్యాండ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఆఫీస్‌ (ఎల్‌ అండ్‌ డీఓ)ను సంప్రదిస్తే మీకు కూడా పార్టీ కోసం అనువైన భూమిని కేటాయిస్తారని కోర్టు చెప్పింది.

 

Exit mobile version