Site icon Prime9

Supreme Court: ఈవీఎంలలో మార్పులు.. పిటిషన్‌ను తోసి పుచ్చిన సుప్రీం కోర్టు

Supreme Court dismissed the petition for changes in EVMs

New Delhi: దేశంలో చేపట్టే ఎన్నికల్లో బ్యాలట్ పత్రాలు, ఈవీఎంలలో మార్పులు చేసేలా ఎన్నికల సంఘానికి సూచనలు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పార్టీల గుర్తు స్థానంలో అభ్యర్ధి పేరు, వయసు, విద్యార్హతతో పాటు ఫోటో ఉండేలా మార్పులకు ఈసీని ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ ను విచారణలోకి తీసుకొనేందుకు ధర్మాసనం నిరాకరించింది. పార్టీల స్థానంలో సొంత అర్హతలో పోటీ చేసేలా ఎన్నికల వ్యవస్ధను మార్చాలన్నది పిటిషనర్ ఉద్ధేశంగా కోర్టు భావించింది. పిటిషనర్ కోరిన మార్పులు చేయడానికి తగిన సాంకేతికత, అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటూ కోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది.

ఇది కూడా చదవండి: Amaravati Petition: అమరావతి వాజ్యాన్ని నేను లేని ధర్మాసనంకు బదిలీ చేయండి.. చీఫ్ జస్టిస్ యు. యు. లలిత్

Exit mobile version
Skip to toolbar