Site icon Prime9

Sunny Deol’s Bungalow Auction: సన్నీ డియోల్ బంగ్లా వేలానికి నోటీసు ఇచ్చి ఉపసంహరించుకున్న బ్యాంక్ .. సాంకేతిక పొరబాటని వెల్లడి

Sunny Deol

Sunny Deol

Sunny Deol’s Bungalow Auction: బాలీవుడ్‌ స్టార్ సన్నీ డియోల్ బ్యాంకు ఆఫ్‌ బరోడా నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో ఆయనకు బ్యాంకు నోటీసులు పంపించింది. బకాయిలు వసూలు చేయడానికి మీ విల్లాను వేలం వేస్తున్నట్లు నోటీసు పంపించింది. ఆదివారం నాడు బాలీవుడ్‌తో పాటు జాతీయ మీడియాలో ఈ వార్త పతాకశీర్షికను ఆకర్షించింది. అయితే బ్యాంకు ఆఫ్‌ బరోడా నోటీసు ఇచ్చిన 24 గంటల తర్వాత విత్‌డ్రా చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సన్నీడియోల్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన గదర్‌ -2 సక్సెక్‌ను ఏంజాయ్‌ చేస్తున్నారు. ఈ సంతోష సమయంలో ఆయనకు ముంబై విల్లాను వేలానికి పెడతామని బ్యాంకు ఆఫ్‌ బరోడా నోటీసు పంపి ఆయన సంతోషంపై నీళ్లు జల్లారు. సన్నీదేవల్‌ విల్లాను విక్రయిస్తామని బ్యాంకు ఆఫ్‌ బరోడా ఆదివారం పత్రికలో ప్రకటన ఇచ్చింది. కాగా ఈ విల్లా ముంబైలోని ఖరీదైన ప్రాంతం జుహులో ఉంది. ఈ విల్లా ఖరీదు 56 కోట్ల రూపాయలుగా లెక్కగట్టారు. పత్రికలో ప్రకటన ఇచ్చిన ఒక్క రోజు తర్వాత బ్యాంకు ఈ ప్రకటన ఉపసంహరించుకుంది. దీనికి కారణం సాంకేతికంగా జరిగిన పొరపాట్లేనని వివరణ ఇచ్చింది. దీంతో ప్రజల్లో లేనిపోని కన్‌ప్యూజ్‌ సృష్టించింది బ్యాంకు ఆఫ్‌ బరోడా.

రూ.56 కోట్ల బకాయి..(Sunny Deol’s Bungalow Auction)

ఇక సన్నీదేవల్‌ బంగ్లా విషయానికి వస్తే.. సన్నీవిల్లాగా ప్రసిద్ది చెందింది. ముంబైలోని అత్యంత ఖరీదైన జుహు సముద్రతీరంలో ఉంటుంది. ఇక్కడే బాలీవుడ్‌కు చెందిన శిల్పాశెట్టి, శ్రద్ద కపూర్‌, పద్మినీ కోల్పాపూర్‌, గోవింద లాంటి నటులు ఉన్నారు. ఇదే విల్లాలో సన్నీ సూపర్‌ సౌండ్‌ అనే ప్రొడక్షన్‌ కంపెనీని కూడా నిర్వహిస్తున్నారు. సన్నీ తండ్రి ధర్మెంద్ర సన్నీ సూపర్‌ సౌండ్‌ ప్రొడక్షన్‌ పేరుతో 50 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చిత్రం నిర్మించారు. ఇదే విల్లాలో పలు సినిమాల స్క్రీనింగ్ జరిగాయి. పలు చిత్రాలకు డబ్బింగ్‌ కూడా ఇదే విల్లాలో కొనసాగాయి. సన్నీ విల్లాలో మొత్తం 600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఐదు అంతస్తులు నిర్మించారు. బేస్‌మెంట్‌తో పాటు మూవీ థియేటర్‌, ప్రొడక్షన్‌ ఆఫీస్‌, టెర్రెస్‌ గార్డెన్‌ కూడా ఈ విల్లాలో ఉంది. సన్నీడియోల్ మొత్తం 56 కోట్ల రూపాయలు బకాయిపడ్డారని బ్యాంకు ఆఫ్‌ బరోడా నోటీసులో పేర్కొన్నారు. నోటీసులో బ్యాంకు నుంచి తీసుకున్న మొత్తంలో తిరిగి చెల్లించలేదని ప్రస్తావించింది. సన్నీ డియోల్‌ విల్లాను వేలానికి పెడుతున్నామని, దీని ప్రారంభ బిడ్డింగ్‌ 51.43 కోట్లుగా ప్రకటించింది. బ్యాంకు జారీ చేసిన నోటీసులో సన్నీదేవల్‌ తండ్రి ధర్మేంద్ర సింగ్‌ దేవల్‌, ఆయన సోదరుడు బాబీ దేవల్‌లో ఈ రుణానికి గ్యారంటీ ఇచ్చారని తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సన్నీ డియోల్‌ తన గదర్‌-2 సినిమా ప్రమోషన్‌ కోసం లండన్‌ వెళ్లారు. బ్యాంకు నోటీసు గురించి ప్రస్తుతం తలెత్తిన వివాదం గురించి ఆయన టీం స్పందిస్తూ పత్రికల్లో వస్తున్న వార్తలను తప్పుబట్టారు.

బ్యాంకు నోటీసును ఉపసంహరించుకున్న వెంటనే కాంగ్రెస్‌ పార్టీ బీజేపీపై మండిపడింది.నోటీసు ఇచ్చిన 24 గంటట్లో ఆఘమేఘాల మీద ఉపసంహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది కాంగ్రెస్‌. సాంకేతిలో లోపం ఎక్కడుందో వివరించాలని కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. సన్నీడియోల్ బీజేపీ తరపున గురుదాస్ పూర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందువలన బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకొని నోటీసును ఉపసంహరింపజేసిందా అన్న అనుమానాలు తెలెత్తుతున్నాయి.

 

Exit mobile version