Sudha Murthy: దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ సందడి నెలకొంది. ఇక కర్ణాటకలోని బెంగళూరు విషయానికి వస్తే ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ ఆర్ నారాయణమూర్తి, ఆయన బార్య రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి, ఇండియన్ క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్‌లు శుక్రవారం పోలింగ్ ప్రారంభమైన వెంటనే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని ఓటర్లు ముఖ్యంగా యువ ఓటర్లు వెంటనే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సుధామూర్తితో పాటు రాహుల్ ద్రావిడ్ పిలుపునిచ్చారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం మన హక్కును పొందుతాం. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా వచ్చి ఆలోచించి సరైన అభ్యర్థికి ఓటు వేయాలని , ఈ అవకాశాన్ని వదులుకోరాదని నారాయణమూర్తి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆయన భార్య సుధా మూర్తి మాట్లాడుతూ.. తన భర్త మూర్తి ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి..(Sudha Murthy)
ఓటు వేయించడానికి ఆయనను ఆస్పత్రిని డిశ్చార్జి చేయించి తీసుకువచ్చామని సుధామూర్తి చెప్పారు. ఓటు వేసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్తామని చెప్పారు మిసెస్ మూర్తి. వాస్తవానికి తాను కూడా ట్రావెల్ ప్లాన్ పెట్టుకున్నానని… అయితే ఈ రోజు పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసుకున్నానని చెప్పారు. మతదాన శ్రేష్ట దాన అని ఆమె కన్నడలో అన్నారు. ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పే బదులు బయటికి వచ్చిన ఓటు వేసి మీ అభిప్రాయం తెలపాలన్నారు సుధామూర్తి. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్‌కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
జయనగర్‌లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో యువత పెద్ద ఎత్తున వచ్చిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మా లాంటి సీనియర్ సిటిజన్లు ముందుగా వచ్చి క్యూ లైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నామని, యువత కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ అతి తక్కువ సంఖ్యలో జరగడంతో ఆమె బెంగళూరు ప్రజలరా వచ్చి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. విద్యాధికులు అతి తక్కువ సంఖ్యలో వచ్చి ఓటు వేస్తారని తనకు చెప్పారు. దయచేసి పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటే వేయాలన్నారు సుధామూర్తి.. క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ విషయానికి వస్తే ప్రజాస్వామ్యంలో ఇది చక్కటి అవకాశం .. ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.