Stepwell Collapse: పండుగ పూట మధ్య ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. శ్రీరామ నవమి వేడుకల్లో జరుగుతున్న వేళ ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలడంతో.. భక్తులు బావిలో పడిపోయారు. ఈ సంఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు భక్తులు గాయపడ్డారు.
ఒక్కసారిగా బరువు ఆపుకోలేక(Stepwell Collapse)
ఈ ఘటన పూర్తి వివరాల ప్రకారం.. మధ్య ప్రదేశ్ లోని పటేల్ నగర్ ప్రాంతంలో ఉండే మహదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారీగా భక్తులు పాల్గొన్నారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో కొంతమంది ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి పై ఉండే ఫ్లోరింగ్‌పై కూర్చున్నారు. అయితే, భక్తులు ఒక్కసారిగా ప్లోరింగ్ పైకి రావడంతో .. తీవ్ర ఒత్తిడికి గురై బరువు ఆపలేక ఆ ప్రాంతం ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో దాదాపు 30 మంది భక్తులు బావిలో పడిపోయారు.
హుటాహుటిన సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. సహాయక చర్యలు చేపట్టి కొందరు భక్తులను బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్టు ఇందౌర్ పోలీసులు వెల్లడించారు. మరో 17 మందిని సురక్షితంగా కాపాడారు. వారికి గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బావి లోతు 50 అడుగుల పైనే ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రధాని దిగ్భ్రాంతి..(Stepwell Collapse)
నవమి వేడుకల్లో మెట్ల బావి కుంగిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు ఫోన్ చేసిన మోదీ పరిస్థితి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అటు సీఎం చౌహన్ కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, సహాయకచర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధితులకు అండగా ఉంటాయని హామి ఇచ్చారు.