Special trains for Maha Kumbh Mela from Visakhapatnam: మహా కుంభమేళా భక్తులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మహా కుంభ మేళాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ప్రయాగ్ రాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఈ మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు రానున్నారు. ఈ మేరకు ఇబ్బందులు తలెత్తకుండా ఇండియన్ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలనుంచి నడవనున్నాయి.
కాగా, విశాఖ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు సైతం ఇబ్బందులు లేకుండా ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తూర్పుకోస్తా రైల్వే నిర్ణయించింది. విశాఖపట్నం టూ గోరఖ్ పూర్, విశాఖపట్నం టూ దీన్ దయాళ్ ఉపాధ్యయ స్టేషన్ల మధ్య 9 ప్రత్యేక రైల్లు నడవనున్నాయి. భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.