Site icon Prime9

Sonia Gandhi: మరోసారి హాస్పిటల్ లో చేరిన సోనియా గాంధీ

Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మరో సారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్ లో చేర్పించారు. సోనియా గాంధీ తీవ్ర జ్వరం, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నట్టు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి హెల్త్‌ బులిటెన్‌లో లెలిపింది. ఆమెను కావాల్సిన పరీక్షలు నిర్వహిస్తున్నామని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు పేర్కొన్నారు.

గురువారమే ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఛెస్ట్ మెడిసన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు నేతృత్వంలోని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది.

కాగా.. ఈ ఏడాదిలో సోనియా ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి కావడం గమనార్హం. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా జనవరిలో ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.

 

కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభలు(Sonia Gandhi)

 

ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభలు జరిగాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగగా..  కాంగ్రెస్ అగ్రనేతలు కీలక ప్రసంగాలు చేశారు.

కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాక గాంధీ సహా అగ్రనేతలు ఇందులో పాల్గొన్నారు.

ఇక ఈ సమావేశాల్లో మాట్లాడిన సోనియా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ విరమణ గురించి ఇందులో ప్రస్తావించారు. దీనికి ముందు.. భాజపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. బీజేపీ హయాంలో అన్నివర్గాలకు అన్యాయం జరుగుతుందని సోనియా ఆరోపించారు.

రాజ్యాంగ విలువలను ప్రభుత్వం పాటించడం లేదని.. దర్యాప్తు సంస్థలను తుంగలో తొక్కుతుందని విమర్శించారు.

రాజ్యాంగ సంస్థలు ఆర్ఎస్ఎస్ బీజేపీ నియంత్రణలో ఉన్నాయని సోనియా మండిపడ్డారు. భాజపా పాలనలో.. దళితులు, మైనార్టీలు, మహిళలు అనేత చిత్రహింసలకు గురవుతున్నారని ఆరోపించారు.

పారిశ్రామిక వేత్తలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశామని సోనియా అన్నారు.

నేడు దేశానికి.. కాంగ్రెస్‌కు సవాలుతో కూడిన సమయమని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో దేశ ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించామని పేర్కొన్నారు.

 

విరమణపై సోనియా కీలక వ్యాఖ్యలు

 

సోనియా గాంధీ రాజకీయాల నుంచి విరమణపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవడాన్ని సోనియా గాంధీ ప్రస్తావించారు.

భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు కీలక మలుపు అని అన్నారు. నా రాజకీయం.. భారత్ జోడో యాత్రతో ముగిస్తుందని సోనియా అన్నారు.

భారత ప్రజల సామరస్యం.. సహనం, సమానత్వాన్ని తాను కోరుకుంటానని సోనియా తెలిపారు.

భారత్ జోడో యాత్ర.. ప్రజలు, పార్టీ మధ్య సంబంధాలను పునరుద్ధరించిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రజలతో నిలబడి, పోరాడటానికి వారు సిద్ధంగా ఉన్నారని ఈ యాత్ర ద్వారా తెలిసిందని సోనియా అన్నారు.

3600 కిలో మీటర్ల కష్టతరమైన పాదయాత్రను.. రాహుల్ ఉత్సాహంగా పూర్తిచేశాడని అన్నారు.

భారత్ జోడో యాత్ర కోసం కష్టపడిన పార్టీ కార్యకర్తలకు.. రాహుల్ గాంధీకి సోనియా కృతజ్ఞతలు తెలిపారు.

 

Exit mobile version