Site icon Prime9

దిశా సాలియన్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతిపై సిట్ విచారణ

Disha

Disha

Disha Salian: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయనున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.

దిశా సాలియన్ మృతి కేసులో సిట్ విచారణ జరగనుంది. ఈ వ్యవహారంలో ఎవరికైనా ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వవచ్చు. ఎవరినీ లక్ష్యంగా చేసుకోకుండా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని ఫడ్నవీస్ తెలిపారు.గురువారం రాష్ట్ర అసెంబ్లీలో దిశా సాలియన్ మృతిపై సిట్ విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే మాధురీ మిసాల్ డిమాండ్ చేశారు. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి చెందిన ఎమ్మెల్యే భరత్ గోగావాలే దిశా సాలియన్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేసారు. బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే కూడా రంగంలోకి దిగి మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రేపై ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా గందరగోళం నెలకొనడంతో సభ ఐదుసార్లు వాయిదా పడింది.దిశా సాలియన్ పోస్టుమార్టం నివేదికను బహిర్గతం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే అమీత్ సతమ్ డిమాండ్ చేశారు.

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్, జూన్ 8, 2020న మలాడ్‌లోని తన కాబోయే భర్త నివాసం 14వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తూ పడిపోవడంతో మరణించారు. దిశ చనిపోయిన ఐదు రోజుల తర్వాత సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Exit mobile version