Site icon Prime9

Shatrughan Sinha: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. మోదీకి థాంక్స్ చెప్పిన టీఎంసీ ఎంపీ

shatraugna

shatraugna

Shatrughan Sinha: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని 2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై సూరత్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో రాహుల్‌కు రెండేళ్లు జైలుశిక్షతో పాటు రూ.15 వేల జరిమానా కూడా విధించింది. అయితే దీనిపై తృణముల్ ఎంపీ.. శత్రుఘన్ సిన్హా స్పందించారు.

‘వినాశకాలే విపరీతబుద్ధి’ (Shatrughan Sinha)

‘వినాశకాలే విపరీతబుద్ధి’ అనే సామెతను ఆయన గుర్తు చేశారు. మోదీ చర్యలు ఇందుకు నిదర్శమని, భవిష్యత్తులో దీని ఫలితాలు ఆయన చూస్తారని అన్నారు.

ఈ సందర్భంగా మోదీకి థాంక్స్ చెప్పారు.
అయితే ఇలాంటివి ప్రజాస్వామ్యానికి ప్రయోజనకరం కానప్పటికీ, విపక్షాల బలాన్ని పెంచుతాయని శత్రుఘన్ సిన్హా అన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై.. అనర్హత వేటు వేయడం రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు గట్టిగా స్పందించాయి.

అయితే దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బీజేపీ మాజీ నేత శత్రుఘన్ సిన్హా కృతజ్ణతలు తెలిపారు.

మోదీ తీసుకున్న ఈ చర్యల వల్ల రాహుల్ గాంధీ సహా విపక్షాలు మరింత బలోపేతం అవుతాయని, వచ్చే ఎన్నికల్లో మరో వంద సీట్లు ఎక్కువ గెలుస్తాయని ఆయన అన్నారు.

‘వినాశకాలే విపరీతబుద్ధి’ అనే సామెతను ఆయన గుర్తు చేశారు. మోదీ చర్యలు ఇందుకు నిదర్శమని, భవిష్యత్తులో దీని ఫలితాలు ఆయన చూస్తారని అన్నారు.

అయితే ఇలాంటివి ప్రజాస్వామ్యానికి ప్రయోజనకరం కానప్పటికీ, విపక్షాల బలాన్ని పెంచుతాయని శత్రుఘన్ సిన్హా అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటి పేరు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో దోషిగా తేలడంతో 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేశారు.

“కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలారు.

23 మార్చి 2023 నుంసీ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాడు.

భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం చర్యలు తీసుకోబడ్డాయి” అని లోక్‌సభ సెక్రటేరియట్ ఈరోజు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Exit mobile version