Bihar: బీహార్‌లో మెడికల్ కాలేజీ విద్యార్దినులపై అద్యాపకుల లైంగిక వేధింపులు

బీహార్‌లోని నలంద జిల్లా పావపురిలోని వర్ధమాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని నలుగురు వైద్యులు మరియు ఒక క్లర్క్‌పై పోలీసులు శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరు వైవా పరీక్షలలో మెరుగైన గ్రేడ్‌ల కోసం కనీసం ముగ్గురు విద్యార్దినుల నుండి లైంగిక ప్రయోజనాలను డిమాండ్ చేశారు. దీనిపై విచారణకు నలంద జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

  • Written By:
  • Publish Date - December 9, 2023 / 05:14 PM IST

Bihar: బీహార్‌లోని నలంద జిల్లా పావపురిలోని వర్ధమాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని నలుగురు వైద్యులు మరియు ఒక క్లర్క్‌పై పోలీసులు శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరు వైవా పరీక్షలలో మెరుగైన గ్రేడ్‌ల కోసం కనీసం ముగ్గురు విద్యార్దినుల నుండి లైంగిక ప్రయోజనాలను డిమాండ్ చేశారు. దీనిపై విచారణకు నలంద జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

పరీక్షల్లో పాస్ చేయడానికి..(Bihar)

బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ప్రాక్టికల్స్, వైవా పరీక్షలకు హాజరైన తర్వాత విద్యార్థినులందరినీ మళ్లీ కాలేజీకి రిపోర్టు చేయాల్సిందిగా పిలిచినట్లు ఫిర్యాదు చేసిన విద్యార్థిని పోలీసులకు తెలిపారు.మేము రిపోర్ట్ చేయకపోతే వైవా టెస్ట్‌లో ఫెయిల్ అవుతామని మాకు ఫోన్‌లో చెప్పారు. మేము కళాశాలకు చేరుకున్నప్పుడు మమ్మల్ని ఒక్కొక్కరిగా అనుమతించారు. అయితే అబ్బాయిలు ప్రధాన గేట్ వెలుపల వేచి ఉన్నారని ఆమె చెప్పింది.ఒక విభాగాధిపతి నన్ను టాపర్‌గా చేస్తే, బదులుగా అతనికి ఏమి ఇస్తావు అని నన్ను అడిగాడు. తరువాత నన్ను ఇద్దరు వైద్యులు ఉన్న మరొక గదికి పంపారు. వారిలో ఒకరు నన్ను ముద్దాడటానికి ప్రయత్నించారని ఆమె చెప్పింది.కనీసం ముగ్గురు అమ్మాయిలు డాక్టర్ల గురించి ఇలాంటి ప్రవర్తనపై ఫిర్యాదు చేశారని ఆమె చెప్పింది . పాస్ మార్కులు ఇచ్చేటం దుకు లేదా మార్కులు పెంచినందుకు ప్రతిఫలంగా లైంగిక ప్రయోజనాలను డిమాండ్ చేశారని ఆరోపించారు.దీనిపై నలంద పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాతే అరెస్టులు చేస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.