New Delhi: ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్బంగా భద్రతా ఉల్లంఘనకు ఫిరోజ్ పూర్ ఎస్ఎస్ఫీ బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై స్వతంత్ర విచారణ కోరుతూ “లాయర్స్ వాయిస్” అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇందు మల్హోత్రా నేతృత్వంలో 5 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. భద్రతా ఉల్లంఘనలకు బాధ్యులైన వారిని, దోషుల పరిధిని, పరిష్కార చర్యలు మరియు రాజ్యాంగ కార్యకర్తల భద్రత పై సూచనలను నిర్ధారించేందుకు ఈ ప్యానెల్ నిర్దేశించబడింది.
కమిటీ సమర్పించిన నివేదిక వివరాలను చదివిన చీఫ్ జస్టిస్ రమణ మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడటంలో ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్ఫీ తన విధిని నిర్వర్తించడంలో విఫలమయ్యాడు. తగినంత బలం అందుబాటులో ఉన్నప్పటికీ మరియు 2 గంటల ముందు తనకు సమాచారం ఇచ్చినప్పటికీ అతను తన బాధ్యతలను నిర్వర్తించలేకపోయాడని పేర్కొన్నారు. భద్రతా ఉల్లంఘన తర్వాత సదరు పోలీసు అధికారిని బదిలీ చేసి లూథియానాలోని 3వ బెటాలియన్‌కు కమాండెంట్‌గా నియమించడం గమనార్హం. బ్లూబుక్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసిందని చీఫ్ జస్టిస్ వెల్లడించారు.
ప్రధానమంత్రి భద్రతకు అవసరమైన దిద్దుబాటు చర్యలు మరియు రక్షణలు ఉన్నాయి. ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని, బ్లూ బుక్ ప్రకారం పోలీసు అధికారులకు శిక్షణ ఇవ్వాలని, వీవీఐపీ సందర్శనల కోసం భద్రతా ప్రణాళిక చేయాలని సూచించినట్లు రమణ తెలిపారు. ప్రధాని మోదీ భద్రతను పటిష్టం చేసేందుకు తగిన చర్యలు తీసుకునేలా నివేదికను కేంద్రానికి పంపుతామని ధర్మాసనం పేర్కొంది.