Site icon Prime9

Aravana Prasadam: శబరిమల ‘అరవణ’ ప్రసాదం విక్రయాలు బంద్.. కారణం ఇదే?

kerala aravana prasadam

kerala aravana prasadam

Aravana Prasadam: శబరిమల ‘అరవణ’ ప్రసాదం గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రసాద విక్రయాలను నిలిపివేయాలని కేరళ హై కోర్టు ఆదేశించింది. ఈ ప్రసాద తయారీ విక్రయాలను నిలిపివేయడానికి ప్రధాన కారణాన్ని కోర్టు వెల్లడించింది.

ప్రధాన కారణం ఇదే

ఈ ప్రసాద తయారీలో వినియోగించే యాలకుల్లో ఎక్కువ రసాయనాలు ఉన్నట్లు ఆహార భద్రతా సంస్థ కోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం వెంటనే ప్రసాద విక్రయాలను నిలిపివేయాలని కోర్టు తెలిపింది. ఇక ఈ రసాయనాలు లేని ప్రసాదాలను విక్రయించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది.

అరవణ(Aravana Prasadam) ప్రసాదం తయారీకి ముందు నుంచి అయ్యప్ప స్పైసెస్ అనే కంపెనీ యాలకులను సప్లై చేస్తుండేది. ప్రస్తుత సంవత్సరంలో యాలకుల కాంట్రాక్టును కొల్లాంకు చెందిన ఓ సంస్థ తీసుకుంది. దీనిపై అయ్యప్ప స్పైసెస్ సంస్థ అభ్యంతరం తెలిపింది. కొల్లాం చెందిన సంస్థ సప్లై చేసే యాలకుల్లో ఎక్కువ రసాయనాలు ఉన్నట్లు అయ్యప్ప స్పైసెస్ బోర్టు ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ యాలకులను పరిశీలించిన అధికారులు.. వీటిలో అధిక రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ ప్రసాదాలు అమ్ముకోవచ్చు

ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో.. విచారణ చేపట్టిన న్యాయస్థానం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రసాదంలో యాలకుల వినియోగం తక్కువే అయినా.. అవి నాణ్యత లేనివని కోర్టు తెలిపింది. దీంతో ఈ ప్రసాదాన్ని భక్తులకు అమ్మవద్దని.. ట్రావెన్‌కోర్‌ బోర్డుకు కోర్టు సూచించింది. అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని కేరళ హై కోర్టు స్పష్టం చేసింది. యాలకులు లేకుండా చేసిన ప్రసాదాన్ని.. నాణ్యతతో చేసిన ప్రసాదాన్ని మాత్రం విక్రయించుకోవచ్చని దేవస్థానం బోర్డును కోర్టు తెలిపింది. ఈ కేసు విచారణను జనవరి 13 వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

 

ఇవీ చదవండి:

బాలకృష్ణ, చిరంజీవి అభిమానుల మధ్య వార్.. వైసీపీ కులాల కుట్ర.. లోకేష్ ట్వీట్ వైరల్

 థియేటర్ లో మాస్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. రచ్చ చేసిన ఫ్యాన్స్

Ram Charan-Upasana: నాతో కలిసి నా బిడ్డకూ ఇది స్పెషల్ ఎక్స్ పీరియన్స్.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్

Veera Simha Reddy Unstoppable 2 Promo: వీరసింహారెడ్డి టీమ్‌తో బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షోలో రచ్చ మాములుగా లేదుగా

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version