Site icon Prime9

Karnataka: కర్ణాటకలో సాధువు ఆత్మహత్య.. ఎందుకంటే?

Saint committed suicide in Karnataka

Saint committed suicide in Karnataka

Ramanagara: కర్ణాటకలో సాధువులు మృతి కలకలం సృష్టిస్తుంది. రెండు నెలల క్రితం ఓ సాధువు ఆత్మహత్యకు పాల్పొడిన సంఘటన మరిచిపోకముందే మరో సాధువు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సమాచారం మేరకు, రామనగర జిల్లాలోని శ్రీ కంచుగల్ మఠానికి 25 సంవత్సరాలుగా సంత్ బసవలింగ స్వామి ప్రధాన పీఠాధిపతిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం మఠానికి సంబంధించిన రజతోత్సవ వేడుకల్ని కూడా ఆయన ఆద్వర్యంలోనే నిర్వహించి ఉన్నారు.

నిన్నటిదినం సాధువు లింగ స్వామి ఆత్మహత్యకు పాల్పొడ్డాడు. తెల్లవారుజామున 4 గంటలకు లేవాల్సిన స్వామి ఆరు వరకు బయటకు రాకపోవడంతో అనుమానంతో సాధువు గది తలుపులు పగలగొట్టారు. ఆవరణలోని పూజాగది కిటికీకి ఉరివేసుకొని వేసుకొనివున్న సాధువును గుర్తించారు. సమాచారం అందుకొన్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సాధువు తానెందుకు మరణిస్తున్నానో తెలిపుతూ రెండు పేజీల లేఖను కూడా వ్రాశారు. మఠాధిపతి నుండి తొలగించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకోసం తన వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడ్డ వారి పేర్లు కూడా నోట్ లో వ్రాసి మరీ మరణించారు. బ్లాక్ మెయిల్ కారణంగానే మఠాధిపతి ఆత్మహత్యకు పాల్పొడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే తప్పు చేయకపోతే పోలీసులను ఆశ్రయించి ఉండవచ్చు గదా అన్ని కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.

రెండు నెలల క్రితం కూడా బెల్లాంలోని శ్రీ గురు మడివళేశ్వర మఠంలోని ఓ సాధువు కూడా లైంగిక వేధింపులకు సంబంధించిన ఆడియోలో ఆయన పేరు రావడంతో కలత చెందిన ఆత్మహత్యకు పాల్పొడిన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. పలు ప్రాంతాల్లో లైంగిక చర్యలు ఇలాంటి ప్రదేశాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. అమాయక మాటలకు బుట్టలో పడ్డ వారు లైంగక వేధింపులకు గురౌతున్నారు.

ఇది కూడా చదవండి: Gujarat: వడోదరలో అల్లర్లు.. పోలీసులపై పెట్రోల్ బాంబులు

Exit mobile version