Site icon Prime9

RSS headquarters: ఢిల్లీ ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ

CISF-security-RSS-office

New Delhi: ఢిల్లీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్) భద్రత కల్పించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ భద్రతను మంజూరు చేసిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

జెడ్ ప్లస్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం ఢిల్లీలోని ఝండేవాల్న్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిఐఎస్‌ఎఫ్ సిబ్బందిని నియమించినట్లు సీనియర్ సిఐఎస్‌ఎఫ్ అధికారి తెలిపారు. నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం మరియు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇప్పటికే సిఐఎస్‌ఎఫ్ రక్షణలో ఉన్నారని ఆయన తెలిపారు.

ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి సెప్టెంబర్ 1 నుండి భద్రత కల్పించబడింది. భవనం ఆవరణలో అధునాతన ఆయుధాలతో కూడిన సిఐఎస్‌ఎఫ్ సిబ్బందిని మోహరించారు” అని అధికారి తెలిపారు. ఏదైనా వ్యక్తి లేదా సంస్దకు ఉగ్రవాద మరియు విధ్వంసక సంస్దలనుంచి ప్రమాదం వున్నట్లయితే కేంద్ర భద్రతా ఏజెన్సీలు రూపొందించిన నివేదికలను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ భద్రతను కేటాయిస్తుంది.

Exit mobile version