Site icon Prime9

Fake Notes: గుజరాత్ లో రూ.25.80కోట్ల నకిలీ నోట్లు.. పట్టుబడ్డ నోట్లన్నీ రెండు వేల రూపాయలే

Rs. 25.80 Crore fake notes ceized at Gujarat police

Rs. 25.80 Crore fake notes ceized at Gujarat police

Gujarat: గుజరాత్ లో రూ. 25కోట్ల 80 లక్షల రూపాయల నకిలీ రెండు వేల రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వీటిని ఓ అంబులెన్సు మాటున తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాయి. పట్టుబడ్డ నోట్ల పై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉండాల్సిన ప్రదేశంలో రివర్స్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరును ముద్రించిన్నట్లు పోలీసులు గుర్తించారు. ట్రంకు పెట్టెల్లో పట్టుబడ్డ నోట్ల పైన సినిమా షూటింగ్ కొరకు అని వ్రాసివున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

దొంగ నోట్ల వ్యవహారాన్ని తెరదించేందుకు సూరత్ ఎస్పీ రిజర్వు బ్యాంకు, ఎస్బీఐ అధికారులను పిలిపించారు. వీటిని దొంగనోట్లుగా గుర్తించాలా లేదా అని వారిని కోరారు. 15 రోజుల క్రితం సూరత్ లోని ఓ వ్యక్తి నుంచి డ్రైవర్ నకిలీ నోట్లను తీసుకొన్నారు. అసలు నోట్లను ఎక్కడ దాచి వుంచారు. ఎందుకోసం ముద్రించారన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చలామణీ కోసమా లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చేందుకు వేసిన పన్నాగమా అన్న కోణంలో పోలీసులు తీగ లాగుతున్నారు.

మరో వైపు సినిమాలకు సంబంధించినది ఐతే పై భాగంలో మాత్రమే నోట్లను ఏర్పాటు చేసుకొంటారు. లోపల భాగంలో కేవలం తెల్లకాగితాలు మాత్రమే ఉంటాయి. ఎటువంటి పరిస్ధితిలోనూ నోట్ల కాగితాలను నకిలీ నోట్లుగా చూపించేందుకు చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఇవి ఎవరిని మోసం చేసేందుకు అంబులెన్సులో తరలిస్తున్నారన్న అనేక అనుమానాలపై పోలీసులు దృష్టి సారించారు.

Exit mobile version