Site icon Prime9

Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి, 8 తీవ్ర గాయాలు

road accident in orissa ganjam district leads to 10 members death

road accident in orissa ganjam district leads to 10 members death

Road Accident : ఒడిశా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంజాం జిల్లాలోని దిగపహండిలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఎంకేసీజీ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

రాయగడ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు..  కందదేవులి గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుక నుంచి జనాన్ని తీసుకుని వెళ్తున్న ప్రైవేటు బస్సును ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది మృతి చెందడం బాధాకరం అని తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని.. తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు, గాయపడిన వారికి రూ. 30 వేల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. కాగా ఈ విషాద ఘటనతో సంబంధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version