Site icon Prime9

Road Accident : మధ్య ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి, 25 మందికి గాయాలు

road accident in madhya pradesh leads to 15 deaths

road accident in madhya pradesh leads to 15 deaths

Road Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీఖండి నుండి ఇండోర్ వెళ్తున్న బస్సు బోరాడ్ నది వంతెన రెయిలింగ్ ను ఢీకొని నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు. ఆ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణీకులున్నారని సమాచారం అందుతుంది. రాష్ట్రంలోని ఖార్గోన్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాద వార్త  గురించి తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇప్పటికే జిల్లా కలెక్టర్ శివరాజ్ సింగ్ వర్మ ఆ చోటుకి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బోరాడ్ నదిపై 50 అడుగుల ఎత్తులో ఈ వంతెన నిర్మించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

 

Exit mobile version