Site icon Prime9

smriti irani: రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ అయితే అమేధీకి పట్టిన గతే పడుతుంది.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

Smriti Irani

Smriti Irani

smriti irani: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు, అతను వయనాడ్‌ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగితే, అమేథీ పట్టిన గతే ఈ నియోజకవర్గానికి పడుతుందని హెచ్చరించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో అమేథీలో రాహుల్ గాంధీని ఓడించిన ఇరానీ ఓడించిన సంగతి తెలిసిందే. అమేథీలో రాహుల్ గాంధీ హయాంలో ప్రాథమిక మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల కొరతను ఎత్తిచూపారు.

రాహుల్ వెళ్లిపోయాకే అన్ని సదుపాయాలు..(smriti irani)

తిరువనంతపురంలో భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) కేరళ యూనిట్ నిర్వహించిన రాష్ట్ర-స్థాయి మహిళా కార్మిక సదస్సులో ఆమె ప్రసంగిస్తూ, గాంధీని అమేథీ నుండి “బయటకు పంపిన” వ్యక్తిగా ఇరానీ తనను తాను పొగుడుకున్నారు. అమేథీలో విద్యుత్ కనెక్షన్లు, అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు, విద్యాసంస్థలు మరియు వైద్య సేవలు వంటి అవసరమైన సౌకర్యాల కొరతను ఆమె ఎత్తి చూపారు, రాహుల్ నిష్క్రమణ తర్వాత క్రమంగా ఇవి మెరుగుపడ్డాయని అన్నారు. అతన్ని (రాహుల్‌గాంధీ)ని యూపీ నుంచి వాయనాడ్‌కు పంపింది నేనే… దానికి కారణం ఆయన అమేథీ ఎంపీగా ఉండగా అక్కడ 80 శాతం మందికి విద్యుత్‌ కనెక్షన్లు లేవని, జిల్లా కలెక్టర్‌లు లేరన్నారు. కార్యాలయం, అగ్నిమాపక కేంద్రం, మెడికల్‌ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, సైనిక్‌ స్కూల్‌, జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్‌ సెంటర్‌, ఎక్స్‌రే మిషన్‌ లేవు.. ఆయన వెళ్లిపోవడంతో అక్కడ అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని ఇరానీ అన్నారు.

అతను వయనాడ్‌లో ఉండిపోతే, అమేథీకి పట్టిన గతి పడుతుంది. కాబట్టి, మీరు (ప్రజలు) అతను ఇక్కడ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. రాహుల్ గాంధీ 2019 ఎన్నికలలో అమేథీ మరియు వాయనాడ్ అనే రెండు స్థానాల్లో పోటీ చేశారు. అమేధీలో ఓడిపోయి వయనాడ్ లో గెలిచారు. అయితే, గుజరాత్‌లోని సూరత్‌లో పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కారణంగా రాహుల్ 2023 మార్చిలో ఎంపీగా అనర్హుడయ్యారు.

Exit mobile version