Site icon Prime9

Ram Mandir: అయోధ్యలో వైభవంగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట

Ram Mandir

Ram Mandir

 Ram Mandir: అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేశారు.అనంతరం బాలరాముడికి ప్రధాని తొలి హారతి ఇచ్చారు. అయోధ్య రామమందిరంపై హెలికాప్టర్ తో పూలవర్షం కురిపించారు. ఈ సందర్బంగా అయోధ్య జై శ్రీరాం నినాదాలతో మార్మోగింది.

నా అదృష్టం..( Ram Mandir)

ఆలయ గర్భగుడిలో ప్రాణపతిష్ట వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.అయోధ్య ధామ్‌లోని శ్రీ రామ్ లాలా యొక్క ప్రాణ ప్రతిష్ట యొక్క దివ్య క్షణం ప్రతి ఒక్కరికీ భావోద్వేగ క్షణం. ఈ విశిష్ట కార్యక్రమంలో భాగం కావడం నా అదృష్టం. జై సియారాం’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.దేశ వ్యాప్తగా కోట్లాదిమంది ప్రజలు టీవీల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. పలు పట్టణాలు, నగరాల్లో కూడళ్ల వద్ద కాషాయ జెండాలను అలంకరించడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్బం గాపలు చోట్ల అన్నదానం కూడా చేసారు.

అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించడానికి క్రీడా, రాజకీయ, పారిశ్రమిక వేత్తలు క్యూ కట్టారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ , విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, గౌతం గంభీర్‌, వెంక‌టేశ్ ప్ర‌సాద్‌, హ‌ర్భ‌జ‌న్ సింగ్, హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌లు బాల రాముడి ప్రాణ ప్ర‌తిష్ఠ వేడుకకు హాజ‌రయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సుమన్, రజనీకాంత్, అమితాబ్,అలియా భట్, రణబీర్ కపూర్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, మాధురి దీక్షిత్, ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ తదితరులు హాజరయ్యారు.

 

అదిగో అయోధ్య రాముని తొలి దర్శనం..! | Ayodhya Ram Mandir | Prime9 News

Exit mobile version
Skip to toolbar