Raksha Bandhan: రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని ఢిల్లీలోని పాఠశాలలకు చెందిన విద్యార్థినులు ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీలు కట్టారు. X లో పంచుకున్న వీడియోలో, పాఠశాల విద్యార్థినులు ప్రధాని మోదీ కి రాఖీలు కట్టడం కనిపించింది.
మోదీ కటౌట్ కు రాఖీలు..(Raksha Bandhan)
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ కటౌట్‌కు వివిధ మతాలు, వర్గాలకు చెందిన మహిళలు రాఖీలు కట్టారు. రక్షా బంధన్ గురించి వారు మీడియాతో మాట్లాడుతూ మేము ప్రతి సంవత్సరం రక్షాబంధన్ నాడు మోడీకి రాఖీ కడతాము, ఇది అన్నా చెల్లెళ్ల పవిత్రమైన పండుగ. సోదరుడు తన సోదరిని రక్షించినట్లు, మేము మోడీ జీ మాగురంచి శ్రద్ద తీసుకోవాలని ఆశిస్తున్నామని అన్నారు.
రక్షా బంధన్ సందర్బంగా ప్రధాని మోదీ X లో (గతంలో ట్విటర్) ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నా కుటుంబ సభ్యులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. సోదరి మరియు సోదరుల మధ్య అపారమైన విశ్వాసం మరియు అపారమైన ప్రేమకు అంకితం చేయబడిన ఈ పవిత్రమైన రక్షాబంధన్ పండుగ మన పవిత్ర సంస్కృతి కి ప్రతిబింబం. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆప్యాయత, సామరస్యం మరియు సామరస్య భావనను మరింతగా పెంచుతుందని నేను కోరుకుంటున్నానని అన్నారు.