Rajya Sabha Elections :15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 56 మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్ లో ముగియనుంది.
ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8 నుంచి నామినేషన్లు ప్రారంభం. రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌కు చివరి తేదీ ఫిబ్రవరి 15. ఫిబ్రవరి 16న నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిభ్రవరి 20 . ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఓటింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇలాఉండగా ఆంధ్రప్రదేశ్ లో 3, బీహార్ లో 6, ఛత్తీస్ గఢ్ లో 1, గుజరాత్ లో 4, హర్యానా 1,హిమాచల్ ప్రదేశ్ లో 1, కర్ఱాటకలో 4, మధ్యప్రదేశ్ లో 5, మహారాష్ట్రలో 6, తెలంగాణలో 3, ఉత్తరప్రదేశ్హ లో 10, ఉత్తరాఖండ్ లో 1, పశ్చిమ బెంగాల్లో 5, ఒడిశాలో 3, రాజస్దాన్ లో 3 స్దానాలకు ఎన్నికలు జరగనున్నాయి.