Sachin Pilot Hunger strike: రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ మంగళవారం జైపూర్‌లోని షహీద్ సమర్క్ వద్ద మంగళవారం నిరాహార దీక్షను ప్రారంభించారు.రాజస్థాన్‌లో బీజేపీ హయాంలో జరిగిన అవినీతి కేసులను దర్యాప్తు చేయడంలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని పైలట్ ఆదివారం ఆరోపించారు. దీనికోసం ఒత్తిడి చేయడానికి ఏప్రిల్ 11 న ఒక రోజంతా నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు.
ఇది పార్టీ వ్యతిరేక చర్య..(Sachin Pilot Hunger strike)
పైలట్ ప్రతిపాదిత ధర్నాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) రాష్ట్ర ఇన్‌చార్జి సుఖ్‌జీందర్ సింగ్ రంధవా సోమవారం రాత్రి తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా నిరసన పార్టీ వ్యతిరేక చర్య అని మరియు పార్టీ ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు.రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాయకత్వ సమస్యను పరిష్కరించాలని పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా పైలట్ చర్య పరిగణించబడుతోంది.పైలట్ మరియు రాంధవా ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. అయితే రాంధవా పైలట్ ను నిరాహార దీక్షను విరమించమని కోరలేదు. వసుంధర రాజే హయాంలో జరిగిన అక్రమార్జనకు వ్యతిరేకంగా ఈ పోరాటం జరుగుతోందని పైలట్ చెబుతున్నారు.. తాను మౌనదీక్షలో కూర్చుంటానని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనని పైలట్ పేర్కొన్నారు.కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా పైలట్ వ్యాఖ్యలను తక్కువ చేయడానికి ప్రయత్నించారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా వ్యవహరించడం లేదని చెప్పడం తప్పు అని అన్నారు.
సంజీవని కుంభకోణం పై దర్యాప్తు..
సంజీవని కుంభకోణంలో రాజస్థాన్‌కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు గజేంద్ర సింగ్ షెకావత్‌పై విచారణ కొనసాగుతోందని ఆయన కూడా ముఖ్యమంత్రి గెహ్లాట్‌పై పరువు నష్టం కేసు పెట్టార అన్నారు.. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం చేసిన పనిని విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి మద్దతు ఇవ్వవద్దని రాజస్థాన్ క్యాబినెట్ మంత్రి సోమవారం పార్టీ కార్యకర్తలను కోరారు.. నిరాహారదీక్ష సమయంలో పైలట్‌తో ఏ ఎమ్మెల్యే లేదా మంత్రి కూడా చేరే అవకాశం లేదు, అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి అతని మద్దతుదారులు వేలాది మంది ఇక్కడ షహీద్ స్మారక్‌కు వచ్చే అవకాశం ఉంది.