Site icon Prime9

Rajasthan assembly: రాజస్థాన్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన.. గత ఏడాది బడ్జెట్ చదివిన సీఎం అశోక్ గెహ్లాట్

Rajasthan

Rajasthan

Rajasthan assembly: రాజస్థాన్ అసెంబ్లీలో ఓక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీలో సీఎం అశోక్ గెహ్లాటే ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో ఆయన కొత్త బడ్జెట్ పత్రాలకు బదులు గత ఏడాది బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చి నవ్వుల పాలయ్యారు.

పాత బడ్జెట్ ప్రతులతో(Rajasthan assembly)

2023-24 బడ్జెట్ ను ప్రవేశపెట్టి అనంతరం ప్రసంగం మొదలు పెట్టే క్రమంలో గత బడ్జెట్ ను చదివి వినిపించారు. దాదాపు 7 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. దీంతో అక్కడ ఉన్న సభ్యులకు ఏమీ అర్థం కాలేదు. తర్వాత జరిగిన తప్పును గుర్తించిన సీఎం గెహ్లాట్ నాలుక కరుచుకున్నారు.

కానీ అప్పటికే జరగాల్సిన తప్పు జరిగి పోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మక బడ్జెట్ విషయంలో ఇలా వ్యవహరించడంపై ప్రతిపక్షాలు అసెంబ్లీలో నిరసనలకు దిగాయి. దీంతో అశోక్ గెహ్లాట్ బడ్జెట్ ప్రసంగాన్ని నిలిపి వేశారు.

ప్రతి పక్షాలు నిరసనలు శాంతించకపోవడంతో అసెంబ్లీని అరగంట వాయిదా వేస్తూ స్పీకర్ సీపీ జోషి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాత బడ్జెట్ ను ప్రతులను చదువుతున్నారనే విషయాన్ని అసెంబ్లీ గ్యాలరీలో కూర్చున్న ఫైనాన్స్ ఆఫీసర్స్ గుర్తించారు. దీంతో వెంటనే ఆ విషయాన్ని చీఫ్ విప్ దృష్టికి తీసుకెళ్లారు.

విప‌క్షాలు ఆందోళ‌న

అశోక్ గెహ్లాట్ ప్రసంగం మొదలు పెట్టి రెండు ప్ర‌క‌ట‌న‌లు చేయగానే.. విపక్షాలకు అసలు విషయం అర్థమైంది. ఆ రెండు స్కీమ్‌లు గ‌త ఏడాది బ‌డ్జెట్‌లో ఉన్న‌ట్లు విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. స్పీకర్ స‌భ‌ను వాయిదా వేయ‌డంతో బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడే నిర‌స‌న కొన‌సాగించారు.

బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు వీలు లేదని.. కొంపదీసి బడ్జెట్ లీకైందా అని బీజేపీ నేతతు ప్రశ్నించారు. గ‌త ఏడాది బ‌డ్జెట్‌లోని ప‌ట్ట‌ణ ఉద్యోగ క‌ల్ప‌న‌, కృషి బ‌డ్జెట్ అంశాల‌పై సీఎం గెహ్లాట్ పాత లెక్క‌లు చ‌దివిన‌ట్లు బీజేపీ ఆరోప‌ణ‌లు చేసింది. 7-8 నిమిషాల పాటు గెహ్లాట్ పాత బ‌డ్జెట్‌నే చ‌దివార‌ని మాజీ సీఎం వ‌సుంధ‌రా రాజే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 

Exit mobile version