Prime9

Madhya Pradesh : మోదీని చంపేందుకు సిద్దం కావాలి… మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రాజా పటారియా

Madhya Pradesh : రాజ్యాంగాన్ని, మైనారిటీలు, దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని ‘చంపేందుకు’ ప్రజలు సిద్ధం కావాలని మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రాజా పటేరియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్ర సోషల్ మీడియాలో కనిపించిన ఒక వీడియోలో మోదీని చంపడానికి సిద్ధంగా ఉండండి. చంపడం అంటే ఎన్నికల్లో ఓడించడం అంటూ ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పడం వినవచ్చు.

మోదీ మతం, కులం, భాషల ప్రాతిపదికన విభజిస్తారు.. దళితులు, గిరిజనులు, మైనార్టీల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని చంపేందుకు సిద్ధంగా ఉండండి. అని పటేరియా ఎంపీ పన్నా జిల్లాలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో అన్నారు.మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పీఎం నరేంద్ర మోదీతో కాంగ్రెస్‌ నేతలు పోటీ చేయలేకపోతున్నారు, అందుకే ఆయన్ను చంపేస్తామని కాంగ్రెస్‌ నేత మాట్లాడుతున్నారు ఇది ద్వేషంలోని పరాకాష్ట.. కాంగ్రెస్‌ భావాలు బయటపడుతున్నాయి.. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నారు. చట్టం తన పనిని తీసుకుంటుంది అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ఎంపీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీపై పటేరియా చేసిన ప్రకటన చాలా అభ్యంతరకరం అని, వెంటనే కాంగ్రెస్ నాయకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసు సూపరింటెండెంట్‌ను ఆదేశించినట్లు చెప్పారు.రాష్ట్ర బీజేపీ చీఫ్ వీడీ శర్మ కూడా ప్రధానిని హతమార్చేందుకు కుట్ర పన్నారేమోనని దీనిపైవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Exit mobile version
Skip to toolbar