Gujarat: భజన కార్యక్రమంలో నోట్ల వర్షం.. ఎక్కడంటే..?

గుజరాత్‌లోని నవ్‌సారి గ్రామంలో జరిగిన జానపద గాయకుడు కీర్తిదాన్ గధ్వి భజన కార్యక్రమంలో దాదాపు రూ.50 లక్షల రూపాయల నోట్ల వర్షం కురిసింది.

  • Written By:
  • Publish Date - December 30, 2022 / 05:54 PM IST

Gujarat: గుజరాత్‌లోని నవ్‌సారి గ్రామంలో జరిగిన జానపద గాయకుడు కీర్తిదాన్ గధ్వి భజన కార్యక్రమంలో దాదాపు రూ.50 లక్షల రూపాయల నోట్ల వర్షం కురిసింది. ప్రజలు ప్రతిరోజూ భజన కార్యక్రమాలలో 10, 20, 50 మరియు 100 రూపాయల నోట్లను జల్లుతున్నారని గాధ్వి చెప్పారు.

బుధవారం స్వామి వివేకానంద నేత్రాలయం ట్రస్టు ఆధ్వర్యంలో నూతన కంటి ఆసుపత్రి నిధుల సేకరణ భజన కార్యక్రమం నిర్వహించారు. నవసారిలోని సుపా గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడే కీర్తిదాన్ గాధ్వి మరియు మరో జానపద గాయని ఊర్వశి రద్దియా ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమం వినేందుకు వందలాది మంది సూపా గ్రామానికి చేరుకుని భజన కార్యక్రమంలో 10, 20, 50, 100, 500 రూపాయల నోట్ల వర్షం కురిపించారు. ఇందులో పెద్దలు కాకుండా పిల్లలు మరియు యువకులు కూడా ఉన్నారు. ఇలా జల్లిన నోట్ల విలువ 50 లక్షల రూపాయలకుపైగా ఉంటుందని గాద్వి తెలిపారు.