Site icon Prime9

Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో హనుమంతుడికి నోటీసులు ఇచ్చిన రైల్వేశాఖ.. ఎందుకో తెలుసా?

Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh: సాధారణంగా ప్రభుత్వ భూముల్లో ఆక్రమణదారులకు ఆయా శాఖలు నోటీసులు జారీ చేయడం అనేది సాధారణంగా జరిగే విషయం. అయితే మధ్యప్రదేశ్‌లో రైల్వే శాఖ అధికారులు ఏకంగా హనుమంతుడికే నోటీసులు జారీ చేసి సంచలనం సృష్టించారు.ని మొరెనా జిల్లాలోని సబల్‌గఢ్ పట్టణంలోని రైల్వే భూమిపై “ఆక్రమణ”ను తొలగించాలని కోరుతూరైల్వే శాఖ హనుమంతుడికి నోటీసు జారీ చేసారు. అయితే ఇది వివాదాస్పదంగా మారడంతో తప్పును గుర్తించిన తర్వాత దానిని ఉపసంహరించుకున్నట్లుఒక అధికారి తెలిపారు.

ఏడురోజుల్లోగా ఆక్రమణలు తొలగించకుంటే చర్యలు.. (Madhya Pradesh)

హనుమంతుడినిఉద్దేశించి ఫిబ్రవరి 8న జారీ చేసిన నోటీసులో ఏడు రోజుల్లోగా ఆక్రమణను తొలగించాలని, లేకుంటే చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖఆదేశించింది. నిర్మాణాన్ని తొలగించేందుకు రైల్వేశాఖ చర్యలు తీసుకుంటే ఆక్రమణదారుడే ఖర్చు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.దేవుడి గుడి వద్ద నోటీసు అతికించారు.ఈ నోటీసు వైరల్‌గా మారి సంచలనం రేపడంతో రైల్వే శాఖ తప్పును సరిదిద్దుకుని ఆలయ పూజారి పేరు మీద కొత్త నోటీసు జారీ చేసింది.

హనుమంతుడి పేరిట నోటీసులు పొరపాటే..(Madhya Pradesh)

దీనిపై ఝాన్సీ రైల్వే డివిజన్ యొక్క పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్ మాథుర్ మాట్లాడుతూ, ప్రాథమిక నోటీసు పొరపాటుగా అందించబడింది.ఇప్పుడు కొత్త నోటీసును ఆలయ పూజారికి అందజేశామన్నారు.షియోపూర్-గ్వాలియర్ బ్రాడ్-గేజ్ లైన్ నిర్మాణం కోసం నిర్మాణాన్ని తొలగించాల్సి ఉంది. దీనితఫిబ్రవరి 10న జారీ చేసిన కొత్త నోటీసును ఆలయ పూజారి హరిశంకర్ శర్మ పేరిట అందించారు.

దేశవ్యాప్తంగా ఆక్రమణల్లో 814 హెక్టార్ల రైల్వే భూములు..

దశాబ్దాలుగా రైల్వే భూమిపై మానవ ఆవాసాలు ఏర్పడి, తరచూ నిరసనలు, ఓటు బ్యాంకు రాజకీయాలు మరియు న్యాయపరమైన జోక్యానికి కారణమవుతాయి.దాదాపు 814 హెక్టార్ల రైల్వే భూములు ఆక్రమణకు గురయ్యాయని కేంద్ర ప్రభుత్వం గతేడాది వెల్లడించింది. మెట్రోలు మరియు ఇతర పెద్ద నగరాల్లోని రైల్వే స్టేషన్ల వద్ద చాలా ఆక్రమణలు ట్రాక్‌ల వెంట మురికివాడల రూపంలో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.ఆక్రమణలను గుర్తించేందుకు రైల్వే శాఖ ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి వాటి తొలగింపునకు చర్యలు తీసుకుంటుంది. ఆక్రమణలు తాత్కాలిక రూపంలో ఉంటే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు స్థానిక పౌర అధికారులతో సంప్రదించి, సహాయంతో వాటిని తొలగిస్తారని కేంద్రం తెలిపింది.

పాత ఆక్రమణల కోసం, ప్రజలను ఒప్పించడానికి వీలులేని చోట, పబ్లిక్ ప్రాంగణాల (అనధికార ఆక్రమణల తొలగింపు) చట్టం, 1971 (PPE చట్టం, 1971) ప్రకారం చర్య తీసుకోబడుతుంది. అనధికార ఆక్రమణదారుల వాస్తవ తొలగింపు రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసుల సహకారంతో నిర్వహించబడుతుంది, ”అని పేర్కొంది, “2017-18 మరియు 2018-19లో వరుసగా 16.68 హెక్టార్లు మరియు 24 హెక్టార్ల భూమిని తిరిగి పొందారు.

రైల్వే కూడా బాధ్యత వహించాలి,..

తమ భూమిపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రైల్వేలదేనని ఏడాది క్రితం సుప్రీంకోర్టు పేర్కొంది. గత 75 ఏళ్లుగా దేశంలో ప్రభుత్వ భూములను ఆక్రమణ చేయడం విచారకరమని కోర్టు పేర్కొంది.

నవంబర్ 2022లో, అస్సాంలోని నోగావ్ జిల్లా యంత్రాంగం రైల్వే ట్రాక్‌లకు ఇరువైపులా ఉన్న వందకు పైగా ఇళ్లను కూల్చివేసింది. వెయ్యి మందికి పైగా ఆక్రమణదారులకు అధికారులు నోటీసులు జారీ చేసి వెళ్లిపోవాలని కోరారు. ఆగస్టు 2021లో, సూరత్-జల్గావ్ రైల్వే ప్రాజెక్ట్ కోసం 5000 మురికివాడలను కూల్చివేయడానికి ప్రణాళిక చేయబడింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాల తర్వాత రైల్వేశాఖ 300 మురికివాడలను కూల్చివేసింది.

ఇవి కూడా చదవండి:

Exit mobile version