Site icon Prime9

Railway Minister Ashwini Vaishnav: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

Ashwini Vaishnav

Ashwini Vaishnav

Railway Minister Ashwini Vaishnav:ఒడిశాలోని బాలాసోర్‌ రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు.275 మంది ప్రాణాలను బలిగొన్న, 1,000 మందికి పైగా గాయపడిన రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశామని వైష్ణవ్ ఆదివారం సాయంత్రం భువనేశ్వర్‌లో విలేకరులతో అన్నారు.

గాయపడిన రోగులకు బాలాసోర్, కటక్ మరియు భువనేశ్వర్‌లోని వివిధ ఆసుపత్రులలో చేరిన గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో కేంద్రం సహాయాన్ని అందిస్తోంది.ఆసుపత్రుల్లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. రోగులను 24 గంటలూ చూసుకునే వైద్యుల బృందాలు ఉన్నాయి, ”అని వైష్ణవ్ చెప్పారు. మృతుల కుటుంబాలను సంప్రదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

ట్రాక్ మరమ్మతులు పూర్తి.. (Railway Minister Ashwini Vaishnav)

బాలాసోర్ ట్రిపుల్ రైలు ప్రమాద స్థలం వద్ద ట్రాక్‌లను పరిశీలించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు అప్ అండ్ డౌన్ రైల్వే ట్రాక్‌లు రెండింటినీ మరమ్మతులు చేసినట్లు తెలిపారు. 16.45 గంటలకు అప్-లైన్ ట్రాక్ లింకింగ్ పూర్తయింది. ఓవర్ హెడ్ విద్యుద్దీకరణ పనులు ప్రారంభమయ్యాయి” అని వైష్ణవ్ ఆదివారం ట్వీట్ చేశారు. అంతకుముందు హౌరాను లింక్ చేసే డౌన్ లైన్ప్  పునరుద్ధరించబడిందని ట్వీట్ చేశారు. మెయిన్‌లైన్‌లోకి వెళ్లేందుకు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ రైలు లూప్‌ లైన్‌లోకి ప్రవేశించి అక్కడ ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీకొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

Exit mobile version