Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రేసులో కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య డికె శివకుమార్ కంటే ముందున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ సిద్ధరామయ్యకు సీఎం పదవి కోసం మద్దతిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా కర్ణాటక అత్యున్నత పదవి కోసం సిద్ధరామయ్యకు మద్దతిస్తున్నారు. అయితే కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) చీఫ్ డికె శివకుమార్ కు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మంచి సంబంధాలు ఉన్నాయి.
ఖర్గేతో సమావేశమయిన రాహుల్ గాంధీ.. (Siddaramaiah)
కర్నాటక ముఖ్యమంత్రి పదవికి ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకునే బాధ్యతను ఖర్గేకు కాంగ్రెస్ అప్పగించింది.కర్ణాటకలో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా తటస్థంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాాలు తెలిపాయి.కర్నాటక తదుపరి ముఖ్యమంత్రిని మంగళవారం ప్రకటించనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మంగళవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సూర్జేవాలా కూడా ఉన్నారు.
పవర్ షేరింగ్ కు నో అన్న ఇద్దరు నేతలు..
డీకే శివకుమార్ మంగళవారం ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో దేశ రాజధానిలోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు.సమావేశంలో శివకుమార్ అభిప్రాయాన్ని మల్లికార్జున్ ఖర్గే తీసుకున్నారు. అయితే శివకుమార్‌తో ఖర్గే ఏమీ మాట్లాడలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. చెరో రెండున్నరేళ్లపాటు సీఎం పదవిని పంచుకునే ఆలోచనను డికె శివకుమార్ మరియు సిద్ధరామయ్య ఇద్దరూ తిరస్కరించారు.సిద్ధరామయ్యతో ఉన్న ఎమ్మెల్యేలు, డీకే శివకుమార్‌తో ఉన్న ఎమ్మెల్యేలు కూడా తటస్థంగా ఉన్నారు, ఎందుకంటే సిద్ధరామయ్య వారి కోసం కూడా ప్రచారం చేశారు.