Rahul Gandhi’s plea: 2019 పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని, సస్పెండ్ చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ చేసిన అప్పీల్‌ను సూరత్ సెషన్స్ కోర్టు గురువారం తోసిపుచ్చింది. సెషన్స్ కోర్టు ఏప్రిల్ 13న ఇరుపక్షాలను విచారించి తీర్పును ఏప్రిల్ 20కి రిజర్వ్ చేసింది. ఈరోజు కోర్టు రాహుల్ గాంధీ శిక్షను సస్పెండ్ చేసినట్లయితే, అతడిని తిరిగి పార్లమెంటు సభ్యుడిగా మారే అవకాశం ఉండేది.
రాహుల్ కు శిక్ష విధించిన సూరత్ కోర్టు.(Rahul Gandhi’s plea)
రాహుల్ గాంధీ 2019లో కేరళలోని వాయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.అయితే భారతీయ జనతా పార్టీ దాఖలు చేసిన కేసులో సూరత్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 23న అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించిన ఒక రోజు తర్వాత అనర్హుడయ్యారు.ఏప్రిల్ 13, 2019న కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో.దొంగలందరికీ మోదీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది? అని గాంధీ చేసిన వ్యాఖ్యలపై పూర్ణేష్ మోదీ క్రిమినల్ పరువు నష్టం కేసు పెట్టారు.
తన ప్రతిష్టకు భంగమన్న రాహుల్ ..
మార్చి 23న ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసి, స్టే విధించకపోతే, అది తన ప్రతిష్టకు కోలుకోలేని నష్టం కలిగిస్తుందని గాంధీ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.అతని అభ్యర్థనను వ్యతిరేకిస్తూ, ఫిర్యాదుదారు పూర్ణేష్ మోదీ రాహుల్ గాంధీ పదేపదే నేరం చేస్తున్నాడని అతని వ్యాఖ్యకు క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడని అన్నారు.