Site icon Prime9

Congress Presidential Polls: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi voted in Congress presidential election

Rahul Gandhi voted in Congress presidential election

Karnataka: రెండు దశాబ్ధాల అనంతరం పార్టీలో ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. పార్టీలోని ప్రతినిధులు నేరుగా తమ ఓటు హక్కుతో అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభమైన పోలింగ్ లో భాగంగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యాలయాల్లో కాంగ్రెస్ ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోంచుకొంటున్నారు.

భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్నాటకలో తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు. అదే విధంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కీలక నేతలు జైరాం రమేష్, తదితరులు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో పోటీదారులుగా నిలిచిన మల్లికార్జున ఖర్గే, శశిధరూర్ లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుతూ మాలో ఎవరు గెలిచినా ఒక్కటేనని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి, అందరం కలిసి పయనిస్తామని వ్యాఖ్యానించారు. ఒకరికొకరు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకొంటూ ఫోన్లు చేసుకొన్నారు. రేపటిదినం లెక్కింపు అనంతరం అధ్యక్ష పదవిని ఎవరిని వరించిందో తెలియనుంది.

ఇది కూడా చదవండి: Congress presidential polls: ఏఐసిసి ఎన్నికల్లో ఆంధ్రా ప్రతినిధుల ఓట్లు 350

Exit mobile version