Site icon Prime9

CRPF : రాహుల్ గాంధీ 113 సార్లు భద్రతా మార్గదర్శకాలు ఉల్లంఘించారు : సీఆర్పీఎఫ్

CRPF

CRPF

CRPF : కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సీఆర్పీఎఫ్ ) మార్గదర్శకాల ప్రకారం రాహుల్ గాంధీకి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. వాస్తవానికి మార్గదర్శకాలను ఉల్లంఘించినది రాహుల్ గాంధీ యేనని తెలిపింది. భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీలో ప్రవేశించినప్పటి నుంచి భద్రతపై పలుమార్లు రాజీ పడ్డారని కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ చేసిన ఆరోపణలపై సీఆర్పీఎఫ్ స్పందించింది.

భారత్ జోడో యాత్ర ఢిల్లీలో ప్రవేశించడానికి రెండు రోజుల ముందు డిసెంబర్ 22నఅడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహించినట్లు సీఆర్పీఎఫ్ పేర్కొంది.”అన్ని భద్రతా మార్గదర్శకాలు ఖచ్చితంగా అనుసరించబడ్డాయి మరియు తగినంత భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ఢిల్లీ పోలీసులు తెలియజేసారు” అని అది జోడించింది.
మార్గదర్శకాల ప్రకారం రాహుల్ గాంధీకి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సహా సంబంధిత వాటాదారులందరికీ కేందర్ హోం శాఖ ముప్పు అంచనా ఆధారంగా సలహాలు జారీ చేయబడ్డాయి. ప్రతి సందర్శనకు అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ కూడా చేపట్టబడుతుందని సీఆర్పీఎఫ్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలో పేర్కొంది.

అనేక సందర్భాల్లో, రాహుల్ గాంధీ నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించడాన్ని గమనించామని, ఈ వాస్తవాన్ని ఎప్పటికప్పుడు ఆయనకు తెలియజేశామని సిఆర్‌పిఎఫ్ సూచించింది., 2020 నుండి, 113 ఉల్లంఘనలు గమనించి తెలియజేసాము. ఢిల్లీ భారత్ జోడో యాత్ర సమయంలో భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని సీఆర్పీఎఫ్ పేర్కొంది.

Exit mobile version