Site icon Prime9

Rahul Gandhi in city Bus: బెంగళూరు సిటీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi in city Bus: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ సారి రాహుల్ గతంలో మాదిరి కాకుండా భిన్నంగా అన్ని వర్గాల ప్రజలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడానికి మెగ్గు చూపారు. ఆదివారం రాహుల్ గాంధీ డెలవరీ బాయ్స్ ను కలిసి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఒక డెలివరీ బాయ్ తో కలిసి అతని స్కూటీపై ప్రయాణించారు.

సోమవారం కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఉంచిన వీడియోలలో ఒకదానిలో, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కళాశాల విద్యార్థులు మరియు శ్రామిక మహిళలతో సంభాషించడం కనిపించింది. రాహుల్ మొదట, బెంగళూరు కన్నింగ్‌హామ్ రోడ్‌లోని కేఫ్ కాఫీ డే అవుట్‌లెట్‌లో ఒక కప్పు కాఫీ కోసం ఆగారు. ఆ తర్వాత, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బస్టాప్‌లో కళాశాల విద్యార్థులు మరియు శ్రామిక మహిళలతో సంభాషిస్తూ కనిపించారు.మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించారు. వారికి నమస్తే అంటూ అభివాదం చేస్తూ రాహుల్ గాంధీ వారి సన్నిహితుల యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు.

మహిళల సమస్యలు గురించి ..( Rahul Gandhi in city Bus)

తరువాత రాహుల్ గాంధీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్బంగా పలువురు మహిళలు రాహుల్ తో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించారు. ప్రయాణంలో మహిళలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఒక మహిళగా మీరు ఎదుర్కొనే అత్యంత కష్టమైన విషయం ఏమిటి అని వారిని అడిగారు. మహిళలు తమ రవాణా సమస్యల గురించి మరియు వారి బడ్జెట్‌లను ప్రభావితం చేసే ధరల గురించి కూడా చెప్పారు.

అనంతరం లింగరాజపురంలో రాహుల్ గాంధీ బస్సు దిగారు. కర్ణాటకలో ఇప్పటి వరకు జరిగిన వరుస ఎన్నికల ర్యాలీల్లో ఆయన ప్రసంగించారు. కర్ణాటకలో ఎన్ని ప్రచారానికి నేడు చివరి రోజు. మే 10న కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Exit mobile version