Site icon Prime9

Bharat Jodo Yatra: సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ భారత్‌ జోడో యాత్ర

New Delhi: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వచ్చే నెల 7వ తేదీ నుంచి భారత్‌ జోడో యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు యాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన పౌర సమాజానికి చెందిన సభ్యులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యాత్రకు సంబంధించి వారితో సమాలోచనలు జరిపారు. ఈ సమావేశానికి పౌర సమాజానికి చెందిన పలువురు సభ్యులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. వారిలో యోగేంద్ర యాదవ్‌, జైరాం రమేశ్‌, దిగ్విజయ్‌ సింగ్‌లున్నారు.

దిల్లీలోని కాన్సిస్టిట్యూషన్‌ క్లబ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత్‌ జోడో యాత్రకు సంబంధించిన దిగ్విజయ్‌ సింగ్‌ వివరాలు వెల్లడించారు. ప్రజలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడాలని సభ్యులను కోరారు. కాగా రాహుల్‌ గాంధీ పౌర సమాజానికి చెందిన సభ్యులతో ముచ్చటించారు.

ఇదిలా ఉండగా రాహుల్‌ గాంధీ పాదయాత్ర మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా సాగుతుంది. మొత్తం 3,500 కిలోమీటర్ల పాదయాత్రను ఆయన 150 రోజుల్లో పూర్తి చేశారని గత వారం జైరాంరమేశ్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు కూడా పాల్గొంటారు.

Exit mobile version