Site icon Prime9

CWC Resolution: రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాలి.. సీడబ్ల్యుసీ తీర్మానం

CWC Resolution

CWC Resolution

CWC Resolution: కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్‌గాంధీ లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాలని పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే రాహుల్‌ను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ప్రతాప్‌సింగ్‌ బజ్వా చెప్పారు.

యావత్‌ దేశం రాహుల్‌ను ప్రతిపక్ష నాయకుడిగా చూడాలనుకుంటోందని ఆయన అన్నారు. కాగా పంజాబ్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ అమరిందర్‌సింగ్‌ రాజా లూధియానా నుంచి గెలుపొందారు. రాహుల్‌ను ప్రతిపక్ష నాయకుడిని ఎంపిక చేసుకోవాలా వద్ద అన్నది పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుంది. దీంతో పాటు రాహుల్‌ కూడా బాధ్యతలు స్వీకరించడానికి సిద్దంగా ఉన్నారా లేదా అనేది కూడా తెలియదని అమరిందర్‌సింగ్‌ అన్నారు. తమ డిమాండ్‌ కూడా రాహుల్‌ గాంధీ ముందుకు వచ్చి తుది నిర్ణయం తీసుకోవాలని పలువురు ఎంపీలు కూడా కోరుతున్నారు. మొత్తానికి ప్రతిపక్ష నాయకుడి హోదాను తీసుకోవాలా వద్దా తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే అని అమరీందర్‌సింగ్‌ రాజా పేర్కొన్నారు. ఇక ప్రధానమంత్రి మోదీ విషయానికి వస్తే 400 సీట్లకు తగ్గవని గొప్పలు చెప్పారు. తీరా చూస్తే ఫలితాలు మాత్రం తారుమారు అయ్యాయి. బీజేపీ సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనే స్థితిలో లేదు. మిత్రపక్షాల దయతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన స్థానంలో నేనుంటే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనని రాజా అన్నారు.

140 కోట్ల భారతీయుల డిమాండ్..(CWC Resolution)

కాగా ఢిల్లీలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం శనివారం నాడు దేశ రాజధానిలో జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ మల్లిఖార్జునఖర్గే, పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రాతో పాలు పలువురు పార్టీ సీనియర్‌ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాత్రం ఈ డిమాండ్‌ 140 కోట్ల భారతీయులదని అన్నారు. సీడబ్ల్యుసీ ఎజెండా ఏమిటో తమకు తెలియదు. తమ డిమాండ్‌ మాత్రం 140 కోట్ల భారతీయుల డిమండ్‌ ఎంటో అదే తమ డిమాండ్‌ అని అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాను రాహుల్‌ తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ సుఖ్‌జిందర్‌సింగ్‌ రంధావా అన్నారు. కాగా రాహుల్‌ మహిళల కోసం నిరుద్యోగుల కోసం పోరాడారని గురుదాస్‌పూర్‌ నుంచి గెలిచిన రంధావా చెప్పారు. ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అతి పెద్ద రెండవ పార్టీగా నిలిచింది. 2019లో పోల్చుకుంటే మెరుగైన సీట్లు సాధించింది. 2019లో 52 సీట్లు సాధిస్తే.. 2024లో 100 సీట్లు సాధించింది. ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఇక రాహుల్‌ను లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా చూడాలనుకుంటున్నార కాంగ్రెస్‌ ఎంపీలు.. కార్యకర్తలు. మరి రాహుల్‌ ఒకే అంటారా లేదా చూడాలి.

Exit mobile version