Site icon Prime9

Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో సైకిల్ తొక్కిన రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో మోటార్‌సైకి నడిపిన ఒక రోజు తర్వాత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం ఇండోర్‌లో తన భారత్ జోడో యాత్రలో సైకిల్ తొక్కారు. ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క తాజా చిత్రాన్ని షేర్ చేసి హిందీలో ఇలా రాసింది. మేము జాతి యొక్క వాయిస్, మీకు వీలైతే మమ్మల్ని ఆపండి.

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఫుట్‌బాల్ ఆడటం, గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేయడం, చిన్నారులతో కలిసి నడవడం, రాష్ట్రవ్యాప్తంగా స్థానికులతో సరదాగా గడపడం వంటివి చేసారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో సాగుతున్న భారత్ జోడోయాత్ర సోమవారం ఉదయం ఇండోర్‌లోని బడా గణపతి చౌరస్తా నుంచి తిరిగి ప్రారంభమైంది. ఇప్పటివరకు ఈ యాత్ర ఏడు రాష్ట్రాలు, 34 జిల్లాల్లో సాగింది.

Exit mobile version