Site icon Prime9

Rahul Gandhi Food walk: గోల్ గప్పాలు తిని.. జ్యూస్ తాగి.. ఢిల్లీ వీధుల్లో రాహుల్ గాంధీ హల్ చల్

Rahul Gandhi Food walk

Rahul Gandhi Food walk

Rahul Gandhi Food walk: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సమీపంలోని బెంగాలీ మార్కెట్ మరియు చాందినీ చౌక్ ప్రాంతంలో వివిధ రుచికరమైన స్నాక్స్ ను అస్వాదిస్తూ ప్రజలతో మాట్లాడారు. బెంగాలీ మార్కెట్ వద్ద, రాహుల్ గాంధీ తన అంగరక్షకుల బృందం అతని చుట్టూ ఉండగా గోల్ గప్పాలను తిన్నారు.

పుచ్చకాయ జ్యూస్ త్రాగిన రాహుల్..(Rahul Gandhi Food walk)

తరువాత అతను ఓల్డ్ ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ రంజాన్ ఉత్సవాల సందర్బంగా వీధుల్లో అనేక నోరూరించే రుచికరమైన వంటకాలు చల్లని పానీయాలతో ఉన్నాయి. రాహుల్ ను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడారు. రాహుల్ అక్కడ పుచ్చకాయ జ్యూస్ ను తాగి  అల్ జవహర్ రెస్టారెంట్లో కెబాబ్ లను తిన్నారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ ప్రజలతో కలిసి ఫోటోలు దిగారు.

జనాభా అధారంగా కులగణన..

2019 పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు అతనికి శిక్ష విధించడంతో ఇటీవల రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు రాహుల్ గాంధీ ఇతర పార్టీ నేతలను కూడా కలుస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ ర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. జనాభా ఆధారంగా కులగణన నిర్వహించాలని డిమాండ్ చేసారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించాలన్నారు. కర్ణాటకలో మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేసారు.

Exit mobile version