Site icon Prime9

Rahul Gandhi Comments: మీరు చాలా అందంగా ఉన్నారు.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానం..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi Comments:కాంగ్రెస్ పార్టీతో మరియు తన పనిలో బిజీగా ఉండటం వలనే తాను పెళ్లి చేసుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జైపూర్‌లోని మహారాణి కళాశాల విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను మంగళవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేశారు.

ముఖానికి క్రీములు రాయను..(Rahul Gandhi Comments)

రాహుల్ చర్మ సంరక్షణ , అతనికి ఇష్టమైన ఆహారం మరియు అతను ఎందుకు వివాహం చేసుకోలేదు? వంటి ప్రశ్నలన్నింటినీ మహిళా విద్యార్దులు రాహుల్ ను అడిగారు. వాటన్నింటికీ ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. కులగణన, స్వాతంత్య్రంలో  మహిళల పాత్ర , అతని ఇష్టాలు మరియు అయిష్టాల గురించి కూడ ప్రశ్నలు అడిగారు. మీరు చాలా అందంగా ఉన్నారు. పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్న ప్రశ్నకు తాను తన పనిలో మరియు కాంగ్రెస్ పార్టీతో బిజీగా ఉన్నందునే బ్రహ్మచారిగా ఉండిపోయానని రాహుల్ చెప్పారు. తనకు ఇష్టమైన వంటకాల గురించి అడిగిన ప్రశ్నకు, గాంధి శనగలు మరియు బచ్చలికూర మినహా అన్నింటినీ ఇష్టపడతానని చెప్పారు.తనకు ఇష్టమైన ప్రదేశం గురించి అడిగినపుడు ఇంత వరకూ చూడని ప్రదేశం ఏదయినా అంటూ బదులిచ్చారు.నేను ఎప్పుడూ కొత్త ప్రదేశాలను చూడాలనుకుంటున్నానని చెప్పారు. రాహుల్ గాంధీ తన చర్మానికి ఎటువంటి క్రీములు రాస్తారు అని అడిగినపుడు దానికి ఆయన ఎప్పుడూ తన ముఖానికి క్రీమ్ లేదా సబ్బును పూయనని కేవలం నీటితో మాత్రమే కడుక్కుంటానని చెప్పారు.

గాంధీ ప్రకారం, స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర పురుషుల కంటే తక్కువ కాదు కాబట్టి వారికి ఎందుకు తక్కువ ప్రాధాన్యం ఉండాలి అని రాహుల్ అన్నారు. మహిళలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి గురించి ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.సమాజంలో మహిళల పట్ల వివక్ష గురించి అడిగినప్పుడు గాంధీ మాట్లాడుతూ డబ్బు ఎలా పని చేస్తుందో, అధికారం ఎలా పని చేస్తుందో, డబ్బు అంటే ఏమిటో మహిళలకు అసలు వివరించలేదని అన్నారు. రాజకీయ నాయకుడు కాకపోతే మీరు ఏమి అయివుండేవారని అడిగిన ప్రశ్నకు, నిజానికి చాలా విషయాలు ఉన్నాను. నేను ఉపాధ్యాయుడిని. నేను యువకులకు నేర్పిస్తాను…నేను వంటవాడిని. కాబట్టి, నేను బహుళ విషయాలు. అది సంక్లిష్టమైన విషయని అన్నారు. సెప్టెంబర్ 23న జరిగిన ఈ సంభాషణల వీడియోను ఇపుడు రిలీజ్ చేసారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్బంగా రాహుల్ గాంధీ సమాజంలోని వివిధ వర్గాల ప్రజలతో సమావేశమయిన సంగతి తెలిసిందే.

Exit mobile version