Site icon Prime9

Rahul Gandhi: స్వర్ణ దేవాలయంలో ప్రార్దనలు చేసి గిన్నెలు శుభ్రం చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ప్రార్థనలు చేసి స్వచ్ఛంద సేవలో పాల్గొన్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ ప్రస్తుతం వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. రాహుల్ ప్రైవసీని గౌరవించాలని పార్టీనేతలు కార్యకర్తలకు చెప్పారు.

పల్కీ సేవకు రాహుల్ గాంధీ..( Rahul Gandhi)

రాహుల్ గాంధీ ఉదయం 11.15 గంటలకు అమృత్‌సర్‌లోని విమానాశ్రయంలో దిగారు. తన తలపై నీలిరంగు గుడ్డ కప్పుకుని, స్వర్ణ దేవాలయంలో ప్రార్థనలు చేసి, గర్భగుడి వద్ద దర్శనం చేసుకున్నారు. అనంతరం సిక్కుల అత్యున్నత స్థానం అయిన అకల్ తఖ్త్‌ను సందర్శించారు. అక్కడ భక్తులు ఉపయోగించే నీటి గిన్నెలను శుభ్రపరచడం ద్వారా సేవ లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం జరిగే ‘పల్కీ సేవ’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. 2015 డ్రగ్స్ కేసులో పార్టీ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్టు నేపధ్యంలో కాంగ్రెస్ నేతలు ఆప్ ప్రభుత్వంపై మండిపడుతున్న సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన రావడం గమనార్హం.కాంగ్రెస్ మరియు ఆప్ ప్రతిపక్షాల I.N.D.I.A కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి, అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలకు పంజాబ్‌లో ఆప్ తో పొత్తును కాంగ్రెస్ నాయకులు కొందరు వ్యతిరేకించారు.

 

Exit mobile version