Site icon Prime9

Rahul-Varun Meeting:కేదార్‌నాథ్ ఆలయంలో కలుసుకున్న రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ

Rahul-Varun Meeting

Rahul-Varun Meeting

Rahul-Varun Meeting: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రంలో మంగళవారం కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ మధ్య అనూహ్య భేటీ జరిగింది. వీరిద్దరూ ప్రార్థనల కోసం కొండపైనున్న ఆలయానికి వెళ్లినపుడు అనుకోకుండా కలసుకున్నారు.

సంతోషంగా సాగిన సమావేశం..(Rahul-Varun Meeting)

ఆలయ ప్రాంగణంలోనే వారిద్దరూ సమావేశమైనట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయేంద్ర అజయ్ ధృవీకరించారు. వారిద్దరు చాలా సంతోషంగా మాట్లాడుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్బంగా వరుణ్ కూతురిని కలుసుకున్నందుకు రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది. బీజేపీ సమావేశాలకు దూరంగా ఉంటున్న రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ మధ్య జరిగిన భేటీ ఆయన రాజకీయ ఉద్దేశాలపై కొన్ని వర్గాల్లో ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఈ సమావేశంలో రాజకీయ అంశాలేమీ  చర్చించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశం చాలా తక్కువ సేపు జరిగినప్పటికీ సోదరులిద్దరూ చక్కగా మాట్లాడుకున్నారని చెప్పాయి. రాహుల్, వరుణ్ గాంధీల భేటీపై ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ స్పందిస్తూ.. రాహుల్ జీని సనాతన ధర్మం వైపు తీసుకెళ్లే సత్తా వరుణ్ జీకి ఉండడం విశేషం.కాంగ్రెస్ సనాతన ధర్మం వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు.

బీజేపీ కార్యక్రమాలకు దూరంగా..

నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మేనకాగాంధీ కి తన క్యాబినెట్లో చోటు కల్పించలేదు. అటువైపు వరుణ్ గాంధీకి కూడా ఎంపీ అయినప్పటికీ పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. దీనితో వీరిరువురూ చాలా రోజులనంచి బీజేపీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలతో సహా పలు కీలక అంశాలపై వరుణ్ గాంధీ బీజేపీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యానించిన సందర్బాలు ఉన్నాయి. తన భర్త సంజయ్ గాంధీ మరణించిన తరువాత కూడా అత్త ఇందిరాగాంధీ తో కలిసి జనపధ్ నివాసంలోనే ఉన్న మేనకా గాంధీ వరుణ్ గాంధీ పుట్టిన రెండేళ్ల తరువాత అంటే 1982 లో ఇందిరతో విబేధించి బయటకు వెళ్లిపోయారు. అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయింది.

Exit mobile version