Site icon Prime9

Rahul Gandhi: రాహుల్ భారత్ జోడో కోసం పీవీ కుటుంబాన్ని పిలిచారు కానీ పీవీ విగ్రహాన్ని సందర్శించలేదు.. పీవీ మనవడు సుభాష్

.Rahul Gandhi

.Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో పాల్గొనమంటూ దివంగత ప్రధాని పీవీ కుటుంబ సభ్యలును ఆహ్వానించారని పీవీ మనవడు సుభాష్ తెలిపారు. ఒక టీవీ చానెల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాహుల్ పీవీ విగ్రం సమీపంలో వెళ్లికూడా ఆయన విగ్రహాన్ని సందర్శించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన సొంత నాయకులను అవమానించడం, వారి త్యాగాలను తక్కువ చేయడం ఇదే మొదటి సారి కాదని ఆయన అన్నారు. గతంలో కూడా సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకుల విషయంలో ఇదే తరహాలో వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు.

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ జయంతి సందర్బంగా రాహుల్ గాంధీ ఢిల్లీలో ఆయన సమాధిని సందర్శించి నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహానికి దండవేసిన రాహుల్ ఆ సమీపంలో ఉన్న పీవీ విగ్రహాన్ని సందర్శించలేదని బీజేపీ నేతలు విమర్శించారు. రాహుల్ గాంధీ డ్రామాలాడుతున్నారని అన్నారు. మరోవైపు వాజ్ పేయ్ ఒకప్పుడు బ్రిటిష్ వారికి అండగా నిలిచారని కాంగ్రెస్ నేత గౌరవ్ పాంధీ చేసిన ట్వీట్ పై బీజేపీ నేతలు మండిపడ్డారు.

బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. “గౌరవ్ పాంధీ తన ట్వీట్‌ను తొలగించారు, కానీ అది సరిపోదు. కాంగ్రెస్ తన స్టాండ్‌ను స్పష్టం చేసి క్షమాపణలు చెప్పాలి. పాంధీని తొలగించాలి. లేదంటే మనం “శబ్ద్ పాంధీ కే, సోచ్ రాహుల్ గాంధీ కీ” అని నమ్మవలసి వస్తుందని పూనావాలా ట్విట్టర్‌లో రాశారు.

Exit mobile version