Site icon Prime9

Punjab: మిలిటరీ స్టేషన్ పై దుండగుల కాల్పులు .. నలుగురు మృతి

Punjab

Punjab

Punjab: పంజాబ్ లోని భటిండా మిలిటరీ శిబిరంలో కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దుండగులు కొంతమంది బుధవారం తెల్లవారుజామున భటిండా మిలిటరీ స్టేషన్ లోకి చొరబడి తుపాకులతో రెచ్చి పోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా .. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో స్టేషన్ లోకి దూరి కాల్పులు జరిపాయి. కాల్పులు శబ్ధం వినిపించగానే స్టేషన్ లోని క్విక్ రియాక్షన్ బృందాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని జల్లెడ పట్టాయి. దీంతో దుండుగులు అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది.

దుండగుల కోసం గాలింపు(Punjab)

భద్రతా దళాలు దుండగుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. మిలిటరీ స్టేషన్ ను మూసివేసి కార్డన్ సెర్చ్ చేపట్టినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ కాల్పుల వెనుక ఉగ్ర కోణం దాగి ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ కాల్పుల ఘటన సమాచారం అందగానే పంజాబ్‌ పోలీసులు మిలిటరీ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. అయితే, ఆ ప్రాంతాన్ని అప్పటికే ఆర్మీ అధికారులు తమ అధీనంలోకి తీసుకోవడంతో వారిని లోపలికి అనుమతించలేదని భటిండా సీనియర్‌ ఎస్పీ వెల్లడించారు.

 

Exit mobile version