Satya Pal Malik: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రధాని మోదీపై సంచనల వ్యాఖ్యలు చేసారు. ప్రధానమంత్రికి అవినీతితో సమస్యలేదని తాను చెప్పగలనని అన్నారు. ది వైర్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.
పుల్వామాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాన్వాయ్‌పై దాడి సీఆర్పీఎఫ్ మరియు హోం మంత్రిత్వ శాఖ యొక్క “అసమర్థత” ఫలితమేనని మాలిక్ అన్నారు.మరీ ముఖ్యంగా, పుల్వామా దాడి జరిగిన కొద్దిసేపటికే కార్బెట్ పార్క్ వెలుపలి నుంచి మోదీ తనకు ఫోన్ చేసినప్పుడు ఈ లోపాలన్నీ నేరుగా తానే లేవనెత్తానని చెప్పారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని మౌనంగా ఉండాలని ప్రధాని తనకు చెప్పారని ఆయన అన్నారు. ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ కూడా మౌనంగా ఉండమని, దాని గురించి మాట్లాడవద్దని చెప్పారని మాలిక్ చెప్పారు. పాకిస్తాన్‌పై నిందలు వేసి ప్రభుత్వానికి మరియు బీజేపీకి ఎన్నికల ప్రయోజనం చేకూర్చడమే ఉద్దేశ్యమని మాలిక్ వెంటనే గ్రహించినట్లు చెప్పారు.పుల్వామా ఘటనలో 300 కిలోల ఆర్‌డీఎక్స్ పేలుడు పదార్థాలతో కూడిన కారు పాకిస్థాన్ నుంచి వచ్చిందని, అయితే 10-15 రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లోని రోడ్లు మరియు గ్రామాల్లో ఎవరికీ తెలియకుండా తిరుగుతున్నందున పుల్వామా ఘటనలో తీవ్ర నిఘా వైఫల్యం ఉందని మాలిక్ చెప్పారు.
తాను గవర్నర్‌గా ఉన్నప్పుడు, హైడ్రో-ఎలక్ట్రిక్ స్కీమ్ మరియు రిలయన్స్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను క్లియర్ చేయమని ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్ తనని సంప్రదించిన వి షయాన్ని కూడా మాలిక్ చెప్పారు. రెండు స్కీమ్‌లను క్లియర్ చేయడానికి రూ. 300 కోట్లు పొందవచ్చని ఆఫర్ వచ్చిందని కాని తాను తప్పు చేయనని ఆయన అన్నారు.కాశ్మీర్ గురించి ప్రధానికి “అజ్ఞానం” మరియు “అవగాహన లేమి ఉందని మాలిక్ అన్నారు. జమ్మ కశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగించడం పొరపాటని, దానిని వెంటనే పునరుద్ధరించాలని ఆయన అన్నారు. మోదీ గురించి మాలిక్ మాట్లాడుతూ.. అవినీతిపై ప్రధానికి ఏమాత్రం పట్టింపు లేదని అన్నారు. 2020 ఆగస్టులో తనను గోవా గవర్నర్‌గా తొలగించి, మేఘాలయకు పంపారని అన్నారు,ఎందుకంటే అవినీతికి సంబంధించిన అనేక సందర్భాలను తాను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని, ప్రభుత్వం వాటిని పరిష్కరించడం కంటే పట్టించుకోకుండా ఉండటమే మంచిదని భావించారని అన్నారు. ప్రధాని చుట్టూ ఉన్న వ్యక్తులు అవినీతికి పాల్పడుతున్నారని, తరచూ పీఎంవో పేరును వాడుతున్నారని మాలిక్ ఆరోపించారు. వీటన్నింటినీ తాను మోదీ దృష్టికి తీసుకెళ్లానని, అయితే ప్రధాని పట్టించుకోలేదని మాలిక్ అన్నారు.
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మంజూరు చేసిన అన్ని అపాయింట్‌మెంట్లు వాస్తవానికి పీఎంవో చే తనిఖీ చేయబడతాయని మాలిక్ చెప్పారు. తాను గవర్నర్‌గా ఉన్న సమయంలో రాష్ట్రపతి ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే సమయంలో చివరి క్షణంలో రద్దు చేశారని చెప్పారు.