Site icon Prime9

Priyanka Gandhi: ఈడీ చార్జ్ షీట్‌లో ప్రియాంక గాంధీ పేరు

priyanka Gandhi

priyanka Gandhi

 Priyanka Gandhi: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జ్ షీట్‌లో మొదటిసారిగా నమోదయింది. ప్రియాంక హర్యానాలో ఐదెకరాల భూమిని కొనడం, అమ్మడం ఘటనకు సంబంధించి ఆమె పేరును ఆమె భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా పేరును చార్జి షీటులో చేర్చారు. అయితే ఇద్దరూ ఇంకా అధికారికంగా నిందితులుగా పేర్కొనబడలేదు.

భూముల కొనుగోళ్లలో..( Priyanka Gandhi)

ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త సిసి థంపి, భారత సంతతికి చెందిన బ్రిటన్‌కు చెందిన సుమిత్ చద్దాపై కూడా ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. పరారీలో ఉన్న ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీకి అతని నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచిపెట్టడానికి వారు సహాయం చేశారని ఈడీ పేర్కొంది. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్‌ఎల్ పహ్వాకు 2006లో హర్యానాలో తన 5 ఎకరాల వ్యవసాయ భూమిని విక్రయించిన ప్రియాంక గాంధీ వాద్రా లావాదేవీలను ప్రస్తావించింది. మరో నాలుగేళ్ల తరువాత అదే భూమిని ప్రియాంక కొన్నారని తెలిపింది. 2006 ఏప్రిల్‌లో ఫరీదాబాద్‌లోని అమీపూర్ గ్రామంలో శ్రీమతి ప్రియాంక గాంధీ వాద్రా పేరిట ఒక ఇంటిని కొనుగోలు చేసి, ఆ భూమిని అదే సమయంలో పహ్వాకు తిరిగి విక్రయించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. రాబర్ట్ వాద్రా 2005 మరియు 2006 మధ్యకాలంలో అమీపూర్‌లో 40.8 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, 2010 డిసెంబర్‌లో పహ్వాకు తిరిగి అమ్మేశారని ఈడీ ఆరోపించింది. ఇదే విధంగా 486 ఎకరాల వ్యవహారం థంపి ద్వారా అమలు చేయబడింది. అతడిని 2020లో అరెస్టు చేసిన తర్వాత బెయిల్‌మంజూరు అయింది. థంపీతో రాబర్ట్ వాద్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది. రాబర్ట్ వాద్రాను ఇతర కేసులలో ఈడీ గతంలో ప్రశ్నించింది.

Exit mobile version