Site icon Prime9

JDS MP Prajwal Case: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్‌ కు ప్రధాని మోదీ అండ.. కాంగ్రెస్ పార్టీ ఆరోపణ

JDS MP Prajwal Case

JDS MP Prajwal Case

JDS MP Prajwal Case: ప్రజ్వల్‌ రేవన్న సెక్స్‌ టేపుల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని కర్ణాటక కాంగ్రెస్‌ మండిపడుతోంది. ప్రస్తుతం ప్రజ్వల్‌ రేవన్న విదేశాల్లో తలదాచుకున్నాడని.. ఆయనను బెంగళూరుకు రప్పించేందుకు బ్లూకార్నర్‌ నోటీసు జారీ చేశామని… దీంతో పాటు ఇంటర్‌పోల్‌ సాయం కూడా తీసుకున్నామని కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. విదేశాల్లో తలదాచుకున్న ప్రజ్వల్‌ను స్వదేశానికి రప్పించడానికి తాము గట్టిగా కృషి చేస్తుంటే, కేంద్రప్రభుత్వం మాత్రం తమకు సహకరించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. విదేశాంగమంత్రిత్వశాఖ దీనిపై మౌనం దాల్చింది. దీన్ని బట్టి చూస్తే.. కేంద్రప్రభుత్వం ప్రజ్వల్‌కు అండగా నిలుస్తోందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదు..(JDS MP Prajwal Case)

ఇదిలా ఉండగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జెడీ ఎస్‌ చీఫ్‌ హెచ్‌డీ కుమారస్వామి గురువారం మధ్యాహ్నం గవర్నర్‌ను కలిసి ప్రజ్వల్‌ కేసును సిటి తో దర్యాప్తు చేయించాలని కోరారు. అయినా తమకు సిట్‌ దర్యాప్తు పై నమ్మకం లేదని కుమారస్వామి అన్నారు. వొక్కలింగా నాయకులు రామలింగారెడ్డి, చెలువర్య స్వామి, కృష్ణ బైరగౌడ్‌తో పాటు కర్ణాటకకు చెందినమంత్రులందరూ సిట్‌ ద్వారా దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వొక్కలింగ నాయకులను తనపై ఎగదోస్తున్నారని కుమారస్వామి అన్నారు. బాధిత కుటుంబాలతో పాటు కిడ్నాప్‌ గురైన మహిళ గురించి ప్రస్తావిస్తూ.. బాధితులను కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదని కుమారస్వామి ప్రశ్నించారు. వారందరిని గెస్ట్‌ హౌస్‌లో ఎందుకు ఉంచారని నిలదీశారు. మరి సిట్‌ అధికారులు మేజిస్ర్టేట్‌ను కలిసి బాధిత మహిళ గురించి సమాచారం ఇవ్వవచ్చు కదా అని జెడీ ఎస్‌ చీఫ్‌ ప్రశ్నించారు.

కర్నాటక ఎమ్మెల్యే హెచ్‌డీ రేవన్న అరెస్టు గురించి ప్రస్తావిస్తూ.. రెవన్నపైఆరోపణలు చేస్తున్న వారు ఆమె బాధితురాలను కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదని కుమారస్వామి నిలదీశారు. వారి ఉద్దేశం ఒక్కటే హెచ్‌డీ రెవన్నను మూడు రోజుల పాటు జైల్లో ఉంచడమేనని ఆయన అన్నారు. ఇక డికె శివకుమార్‌ ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ.. ప్రజ్వల్‌ రెవన్న పెన్‌ డ్రైవ్‌లను కుమారస్వామి విడుదల చేశారని డీకె ఆరోపించారు. డీకె చప్పేవన్నీ కాకమ్మ కథలని…. ఆయన చెప్పదలచుకుంది చెప్పుకోనియండి.. సమయం వచ్చినప్పుడు తాను జవాబుచెబుతానని కుమారస్వామి అన్నారు. ఇక హెచ్‌డీ రెవన్నతో పాటు ఆయన కుమారుడు ప్రజ్వల్‌ రెవన్న విషయానికివస్తే వీరు తమ ఇంట్లో పనిచేసే పనిమనిషులపై లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం సిటితో దర్యాప్తు చేయిస్తోంది.

 

Exit mobile version