Uttarakhand Vande Bharat Express :ఢిల్లీ (ఆనంద్ విహార్)-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లో ప్రవేశపెట్టిన తొలి వందే భారత్ రైలు ఇది కావడం విశేషం.
ప్రపంచం భారత్ కు రావాలని కోరుకుంటోంది..(Uttarakhand Vande Bharat Express)
ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌లో ఈరోజు డెహ్రాడూన్ నుండి ఢిల్లీకి మొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. ఈ రైలు ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.భారతదేశాన్ని ఎంతో ఆశతో చూస్తున్నారని, ప్రపంచం భారత్‌ను చూసి రావాలని కోరుకుంటున్నదని అన్నారు. భారతదేశాన్ని చూడటానికి, భారతదేశ సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచం భారతదేశానికి రావాలని కోరుకుంటోంది, అటువంటి పరిస్థితిలో, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి వందే భారత్ రైలు కూడా ఉత్తరాఖండ్‌కు సహాయం చేయబోతోందని మోదీ అన్నారు. ఢిల్లీ మరియు డెహ్రాడూన్ మధ్య నడిచే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దేశ రాజధానిని వేగంగా కలుపుతుంది” అని ప్రధాని మోదీ అన్నారు.
మే29 నుంచి రెగ్యులర్ సర్వీసులు..
రైల్వే వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ గా మే 29న ప్రారంభమవుతుంది.ఈ రైలు 302 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 45 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రైలు బుధవారం మినహా వారంలో అన్ని రోజులు నడుస్తుంది.ఏసీ చైర్‌కార్‌కు రూ.1,065, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌కు రూ.1,890గా నిర్ణయించారు. ఈ రైలు ఎనిమిది కోచ్‌లను కలిగి ఉంటుంది. డెహ్రాడూన్‌కు వెళ్లే రైలు నంబర్ 22457 ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ నుండి 17:50కి బయలుదేరి 22:35కి డెహ్రాడూన్ చేరుకుంటుంది. ఈ రైలు మీరట్ సిటీ, ముజఫర్‌నగర్, సహరాన్‌పూర్, రూర్కీ మరియు హరిద్వార్‌లలో ఆగుతుంది